Read News in Telugu Language
adsdaksha

సింగిల్ హ్యాండ్ కి ఓటేయండి.. ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి : సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ ..

దక్ష న్యూస్, ఖమ్మం: మే 7

సినీ నటుడు విక్టరీ వెంకటేష్ మంగళవారం ఖమ్మం నగరంలో సందడి చేశారు. అమ్మా…. అక్క… బాబూ.. తాతా… చెల్లి…. తమ్ముడూ అంటూ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈవీఎంలో మూడో నెంబర్ “గుర్తుం”దా…! అదేనండి మన హస్తం గుర్తు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో మన ఆర్ఆర్ఆర్ కి ఓటు వేసి గెలిపించండి అంటూ సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్  ( daggubati venkatesh ) ఖమ్మం ప్రజలకు పిలుపు నిచ్చారు.

ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం లోని మయూరి సెంటర్ నుంచి పాత బస్టాండ్, జెడ్పీసెంటర్, పాత కలెక్టరేట్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు రోడ్ షో నిర్వహించారు. మంత్రి పొంగులేటి, ఎంపీ రేణుకా చౌదరి, అభ్యర్థి ఆర్ఆర్ఆర్ పాల్గొన్న ఈ రోడ్ షోలో వెంకటేష్ పాల్గొన్నారు.

Read also: బీజేపీ, బీఆర్ఎస్ రాష్ట్రానికి చేసిందేమీ లేదు : బోనకల్ రోడ్ షోలో మంత్రి పొంగులేటి ..

Hospital

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…! అక్కడ భద్రాచలంలో శ్రీ రాముడు… ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు… అలాంటి రఘురాముడికి ఓటువేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అందరికీ “గుర్తుం”ది…! కదా…మే 13..! ఆ రోజు ఈవీఎంలో మూడో నెంబర్ హస్తం గుర్తుకు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత… మన హక్కు…. అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

 

 

ఎనీ టైం… ఎనీ సెంటర్ అంటూ వెంకీ మామ సందడి..

ఎనీ టైం … ఎనీ సెంటర్… సింగిల్ హ్యాండ్ రఘురాముడు…

ఖమ్మం… ఖమ్మం… ఖమ్మం…. కమాన్ అంటూ సినీ హీరో వెంకీ మామ నగరంలో సందడి చేశారు. మయూరి సెంటర్ నుంచి ఇల్లందు క్రాస్ రోడ్ వరకు జరిగిన రోడ్ షో లో ఖమ్మం ప్రజానీకం వెంకటేష్ ను చూసేందుకు ఉత్సాహకత చూపారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన రోడ్ షో ఆద్యంతం ఖమ్మం ప్రజానీకాన్ని అలరించింది. అడుగడుగునా వెంకటేష్ కు నీరా’జనం’ పలికారు. అభివాదం చేస్తూ… హస్తం గుర్తుకు ఓటు వేసి ఆర్ఆర్ఆర్ ను గెలిపించాలని కోరుతూ వెంకటేష్ ముందుకు సాగారు.

Leave A Reply

Your email address will not be published.