Read News in Telugu Language
adsdaksha

ముగిసిన జాబ్ మేళా..

దక్ష న్యూస్, ఖమ్మం రూరల్: ఆగస్ట్ 18

అర్హత ఉన్న ప్రతి విద్యార్థి  ప్లేస్ మెంటే లక్ష్యంగా దరిపల్లి కళాశాల ( daripalli college ) ప్లేస్మెంట్ వింగ్ పనిచేస్తుందని దరిపల్లి ( daripalli ) విద్యాసంస్థల అధినేత, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. కిరణ్ ( dr. d. kiran ) అన్నారు. శుక్రవారం ఖమ్మం (khammam ) రూరల్ మండలం సత్యనారాయణపురం కొత్తూరు గ్రామ శివారులో గల దరిపల్లి అనంత రాములు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆడిటోరియం లో విద్యార్థులకు జాబ్ మేళా ( job mela) నిర్వహించారు. ప్రముఖ ఎన్ ఎస్ డి సి ( NSDC ) & స్కిల్ ఇండియా శిక్షణ భాగస్వామి ఇమార్టికస్ నిర్వహించిన స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అర్హత, ప్రతిభ కలిగిన 30 మందిని ఎంపిక చేసి వారిని తదుపరి ఇంటర్వ్యూలకి సెలెక్ట్ చేశారు.  జాబ్ మేళాకి ఖమ్మం, భద్రాచలం, ఇల్లందు, మహబూబాబాద్, వరంగల్,సూర్యాపేట, మిర్యాలగూడ , హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు. ఈ ప్రాంగణ నియామకాలకి ఇమార్టికస్ కంపెనీ నుంచి హెచ్.ఆర్ కిరణ్ పాల్గొన్నారు.

read also : దుమ్ముగూడెం విద్యార్థినికి హర్యానా గవర్నర్ ప్రశంసలు..రాజ్ భవన్ కి రావాల్సిందిగా ఆహ్వానం..

Hospital

ఈ సందర్భంగా డాక్టర్ దరిపల్లి కిరణ్ మాట్లాడుతూ కళాశాలలో ప్లేస్మెంట్ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. వివిధ కంపెనీలకు మా దగ్గర కు వచ్చిన ప్రతి విద్యార్థిని  పంపించే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్లేస్ మెంట్ ఆఫీసర్ మలోత్ లాలూ, కళాశాల సిబ్బంది ప్రవీణ్ రవిచంద్ర, ప్రభాకర్,ప్రసన్న , సందీప్, వెంకట్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొని జాబ్ మేళాను విజయవంతం చేశారుచేశారు.

read also : యోధుడిగా నిఖిల్ సిద్దార్థ..

Leave A Reply

Your email address will not be published.