Read News in Telugu Language
adsdaksha

రాజకీయ సానుభూతి కోసమే కేజ్రీవాల్ అరెస్ట్ ను ఆహ్వానించారు.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 24

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) పంపిన సమన్లను పట్టించుకోని కారణంగానే మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు. తనను అరెస్ట్ చేయాలని ఆయనే కోరి తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు. రాజకీయ సానుభూతి పొందేందుకే ఇలా చేశారని ఆరోపించారు.

Read also: వచ్చే హోలీ నాటికి అర్హులంతా కొత్త ఇందిరమ్మ ఇళ్లలో ఉంటారు..

Hospital

ఈడీ పంపిన తొమ్మిది సమన్లకు ఒక వ్యక్తి స్పందించకపోతే అరెస్టును ఆహ్వానించడమేనని బిశ్వశర్మ అన్నారు. అరవింద్ కేజ్రీవాల్ మొదటి సమన్లకు స్పందించి ఉంటే, ఆయనను అరెస్టు చేసేవారు కాదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా బిశ్వశర్మ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను ప్రస్తావించారు.

Read also:ప్రధాని మోదీ భూటాన్‌ టూర్.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం‘డ్రుక్ గ్యాల్పో’ ప్రధానం ..

సమన్లు వచ్చిన వెంటనే వారిద్దరూ ఈడీ ఎదుట హాజరయ్యారని గుర్తు చేశారు. కానీ, కేజ్రీవాల్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని అన్నారు. రాజకీయ సానుభూతి కోసమే ఇలా చేశారన్నది స్పష్టం అని వెల్లడించారు.

 

Leave A Reply

Your email address will not be published.