Read News in Telugu Language
adsdaksha

కేజ్రీవాల్ కు ఆరోసారి సమన్లు.. 19న విచారణకు ఈడీ ఆదేశం..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 15

లిక్కర్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు పంపింది. ఫిబ్రవరి 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఐదు సార్లు గతేడాది నవంబరు 2, డిసెంబరు 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలంటూ కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Read also: తొలిసారి రాజ్యసభకు సోనియా నామినేషన్.. రాజస్థాన్‌ నుంచి పోటీ..

Hospital

అయితే ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను పిలుస్తున్నారని కేజ్రీవాల్‌ ఆరోపిస్తూ ఈడీ విచారణకు హాజరుకాలేదు. దీంతో సమన్లు జారీ చేసిన ప్రతిసారీ కేజ్రీవాల్ విచారణకు స్పందించటం లేదని ఢిల్లీలోని రౌజ్‌ అవెన్యూ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్​ను ఫిబ్రవరి 17న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

Read also: 95మంది డీఎస్పీలు బదిలీ.. పోలీస్ డిపార్ట్ మెంట్ లో వరుస ట్రాన్స్ ఫర్స్..

కోర్టులో ఆ విచారణ జరగకముందే కేజ్రీవాల్ కు ఈడీ ఆరోసారి సమన్లు జారీ చేయడం చర్చానియాంశం అయింది. మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు కేజ్రీవాల్​ ను 2023 ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.