Read News in Telugu Language
adsdaksha

ఢిల్లీలో హై అలర్ట్.. ఆందోళనకు అన్నదాతల పిలుపు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 11

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  రైతులు  ఆందోళనకు దిగడంతో హరియాణా, ఢిల్లీ (Delhi)లో పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం (ఈ నెల 13న) ‘ఢిల్లీ చలో’ కార్యక్రమాన్ని 200 రైతు సంఘాలు చేపట్టనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపైకి ప్రజలు అత్యవసరమైతే తప్ప రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Read also: గుట్టపైకి ఆటోలకు ఎంట్రీ.. ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య..

అంబాల, సోనిపట్, పంచకుల్లో సెక్షన్ 144ను విధించారు. తదనుగుణంగా ప్రజలు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరారు. 50 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచారు.

Hospital

Read also: హెలికాప్టర్ కూలి ఆరుగురు మృతి.. మృతుల్లో ‘యాక్సెస్ బ్యాంక్’ సీఈవో..

ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించారు. పంజాబ్, హరియాణా నుంచి రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రేన్లు, కంటైనర్లను రెడీ చేశారు. రైతులు నగరంలోకి రావాలని యత్నిస్తే వీటిని వాడి సరిహద్దులను మూసివేస్తామని తెలిపారు. కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్ధూర్ మోర్చా వంటివి ఆందోళనలో పాల్గొననున్నాయి.

Read also: శెభాష్ రేవంత్..! ప్రజా ప్రభుత్వంపై కేఏ పాల్ రియాక్షన్..

ఈ సందర్భంగా రైతు జగ్జీత్ సింగ్ దాలెవాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఓ వైపు చర్చలకు పిలుస్తూనే హరియాణాలో తమని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. సరిహద్దులు మూసేవేసి 144వ సెక్షన్ విధించారు. ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేయడం జరిగింది. అసలు ప్రభుత్వానికి ఈ అధికారం ఉందా ఇలాంటి పరిస్థితుల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగవు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టిపెట్టాలని జగ్జీత్ సింగ్ దాలెవాల్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.