Read News in Telugu Language
adsdaksha

కవితకు ఏదైనా అయితే మహిళా లోకం అంతా అగ్నిగుండం అవుతుంది..మంత్రి శ్రీనివాస్ గౌడ్

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 14

ఢిల్లీ లిక్కర్ స్కామ్ ( delhi liquor scam) లో బీఆర్ఎస్ ( brs ) ఎమ్మెల్సీ కవిత (mlc kavitha) కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. శుక్రవారం నాడు విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు జారీ చేయడాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( srinivas gaud ) తీవ్రంగా ఆక్షేపించారు. గురువారం నాడు ఆయన పాలమూరు రంగారెడ్డి ( palamuru – rangareddy ) ప్రాజెక్టు సందర్శనలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా తీగలపల్లి సమీపంలోని ఏదుల రిజర్వాయర్ వద్ద మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని గత కొంత కాలంగా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న డిమాండ్ ను ఓర్వలేక ఆమెకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చారన్నారు. ఆమెకు ఏ మాత్రం సంబంధం లేని అంశాన్ని తీసుకుని కావాలని ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ కు కర్ణాటక, మహారాష్ట్రలో లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక కవితపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

read also : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ ఆమోదం..

ఇటీవల దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేసి వారి మద్దతు కూడగట్టి పార్లమెంటులో మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని కవిత ప్రయత్నించారని అన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ లను అడ్డం పెట్టుకొని అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను బిజెపి వాళ్లు కూలగొట్టారని మంత్రి ఆరోపించారు. కవిత తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి తెలంగాణ పోరాటాన్ని ప్రపంచమంతా తెలిసేలా చేశారని, మహిళా బిల్లును ప్రవేశపెట్టాలని ఆమె చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. విజయ్ మాల్యా లాంటివారు లక్ష కోట్లకు పైగా ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయి అక్కడ దర్జాగా జీవిస్తున్నారు కానీ కేంద్రం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

Hospital

read also : త్వరలో జిల్లాలో బిఎస్సీ పారా మెడికల్ కళాశాల.. మంత్రి హరీశ్ రావు..

లిక్కర్ స్కాం లో ఏ మాత్రం సంబంధం లేని కవితను అనవసరంగా భయపెట్టేందుకు కుట్ర చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కుటుంబాన్ని కట్టడి చేస్తే కెసిఆర్ ఆగుతారేమోఅని బిజెపి భ్రమ పడుతున్నదని, రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడిన సీఎం కేసీఆర్ వీరి తాటాకు చప్పుళ్లకు భయపడరన్నారు.

అనవసర బెదిరింపుల వల్ల వాళ్లే బలహీనం అవుతారని పేర్కొన్నారు. ఇప్పటికే బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని అన్ని పక్షాలు ఏకం అవుతున్నాయని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనాన్ని తట్టుకోలేక ఇలాంటి వాటికి పాల్పడుతున్నారు కవితకు ఏమైనా అయితే మహిళా లోకం అంతా అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. కవితకు అండగా దేశంలోని ప్రతి మహిళ బయటకొస్తుందన్నారు.

read also : మ‌హిళా లోకాన్ని చైత‌న్య ప‌ర‌చండి ..మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ..

Leave A Reply

Your email address will not be published.