Read News in Telugu Language
adsdaksha

మెరిసి మురిసిన ఖమ్మం.. ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు..

దక్ష న్యూస్, ఖమ్మం : ఏప్రిల్ 13

చిన్నారుల కేరింతలు.. ఆటపాటలతో ఎస్ఆర్ బిజిఎన్ఆర్ కళాశాల మైదానం సందడిని సంతరించుకుంది. అబ్బురపరిచే నృత్యాలు, అలనాటి మేటి చిత్రాల గీతాలు.. గ్రూప్ సాంగ్ లతో వీక్షకుల్ని అబ్బురపరిచింది. ఆబాలగోపాలాన్ని అలరించే సంస్కృతిక కార్యక్రమాలకు ఆలవాలంగా ఖమ్మం ( khammam ) ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ( delhi public school ) యాజమన్యం నిర్వహించిన కార్యక్రమాలు వినూత్న వెలుగుజిలుగుల్లో.. సాంకేతిక టెక్నాలజీ సోయగాల్లో డిజిటల్ స్క్రీన్ పై ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ సీనరీస్ ముందు చిట్టిపొట్టి అడుగుల చిన్నారుల అద్భుత ప్రదర్శనలు ఓౌరా అనిపించాయి. వివరాల్లో కెళితే శనివారం ఖమ్మం ఎస్ ఆర్ బిజిఎన్ ఆర్ కళాశాల మైదానంలో మమతా కళాశాల రోడ్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ద్వితీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాలు ఆ పాఠశాల విద్యార్ధుల ప్రతిభాపాటవాలకు అద్దం పట్టాయి.

విద్యార్ధి దశ నుండే వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలి..

Hospital

ప్రతీ ఒక్కరూ విద్యార్థి దశ నుండే తమ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని మెరుగులు దిద్దుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చిన్న తనంలో అలవడిన పట్టుదల క్రమశిక్షణ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తాయన్నారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం చదువుతోపాటూ అందిస్తున్న వివిధ రకాల అవకాశాలతో విద్యార్ధులు చదువుతోపాటూ వివిధ రంగాల్లో ప్రావీణ్యం పొందవచ్చన్నారు. విద్యార్ధుల తల్లిదండ్రులు ఈ అవకాశాల్ని తమ పిల్లల భవిష్యత్తుకోసం సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ కడారి రవీందర్ మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా తమను ఆదరిస్తూ తగు సలహాలు సూచనలు ఇస్తున్న విద్యార్ధుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. మరెన్నో మంచి మార్పులతో మూడో సంవత్సరంలో మెరుగైన మార్పులను అందిస్తామని భరోసా ఇచ్చారు. పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న రిపోర్ట్ ను వినిపించారు. కార్యక్రమంలో గ్లోబల్ ట్రస్ట్ పౌండేషన్ సభ్యులు పన్నీరు జగన్ మోహన్ రెడ్డి, యోగనంద రెడ్డి, కడారి వినీత రెడ్డి, పాఠశాల బోధన, భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు. నలుగురు విద్యార్ధులకు బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ 23- 24 అవార్డులను అందజేశారు.

Leave A Reply

Your email address will not be published.