Read News in Telugu Language
adsdaksha

dell : వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు షాక్ .. ప్రముఖ కంపెనీ డెల్ నోటీసు..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 19

ప్రముఖ టెక్ సంస్థ డెల్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు షాకిచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో టెక్ సంస్థలన్నీ తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ వెసులుబాటు కల్పించాయి. అయితే కరోనా సమసిపోవడంతో టెక్ కంపెనీలు చాలా వరకు ఉద్యోగులకు ఆఫీసుకు రావాలని ఆదేశాలిచ్చాయి. అయినా కొంతమంది ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థ డెల్ కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ నిబంధనల ప్రకారం ఆఫీసుకు రాని వారికి ప్రమోషన్లు ఉండబోవని చెప్పి షాకిచ్చింది.

read also : మా తల్లులను, కూతుళ్లను కాపాడేందుకు సిద్దం.. రాహుల్ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోదీ ఫైర్ ..

Hospital

ఇప్పటికీ ఇంటి నుంచి పని చేయాలనుకునే వారు అదే విధానాన్ని కొనసాగించొచ్చని డెల్ తమ ఉద్యోగులకు ఫిబ్రవరిలో జారీ చేసిన మెమోలో తెలిపింది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగులెవ్వరినీ ప్రమోషన్లకు పరిగణించబోమని తేల్చి చెప్పింది. ప్రస్తుతం కంపెనీలో హైబ్రిడ్ పని విధానం కొనసాగుతోందని, ప్రతీ ఉద్యోగి వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీసుకు రావాలని చెప్పింది. అలా రాని పక్షంలో ఇంటి నుంచి పని చేస్తున్నట్టు భావించి.. వారెవరికీ పదోన్నతులు ఉండబోవని స్పష్టం చేసింది. అలాగే జాబ్ రోల్ మార్చుకునే అవకాశం సైతం ఇవ్వబోమని పేర్కొంది.

read also : ఏప్రిల్ 22లోపు అప్లై చేసుకోవచ్చు .. హోమ్ ఓటింగ్‌పై సీఈఓ వికాస్ రాజ్ ..

Leave A Reply

Your email address will not be published.