Read News in Telugu Language
adsdaksha

యాదాద్రి ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 12

డిప్యూటీ సీఎం గా రాష్ట్రాన్ని శాసిస్తున్నాను.. నేనెవరికో తల వంచే వాడిని కాదు ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునేవాడిని కాదు .. ఆత్మగౌరవాన్ని చంపుకునే మనస్తత్వం నాది కాదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేను కావాలనే యాదాద్రి దేవాలయంలో వేద పండితుల ఆశీర్వచన సమయంలో చిన్న పీట మీద కూర్చున్నానని, ఆ ఫోటోతో కావాలనే ట్రోల్ చేస్తున్నారన్నారు. యాదాద్రి ఘటనపై స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( deputy cm bhatti vikramarka ) తనను ట్రోల్ చేసేవారిని దృష్టిలో పెట్టుకొని పై వ్యాఖ్యలు చేశారు. వారందరికీ ధన్యవాదాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో నా నిర్ణయాలే కీలకం. ఆర్థిక విద్యుత్తు ప్రణాళిక శాఖలను ఉప ముఖ్యమంత్రి గా నేనే చూస్తున్నానన్నారు.

read also : భాగ్యనగరంలో 25 ఎలక్ట్రిక్ బస్సులు .. మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభం ..

సింగరేణి కాలరీస్ కి సంబంధించి హైదరాబాద్ నగరంలో గెస్ట్ హౌజ్ కి భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని భట్టి వెల్లడించారు. సింగరేణి కాలరీస్ కి సంబంధించిన జిల్లా అయిన ఖమ్మం కి చెందిన వ్యక్తి గా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సింగరేణి తెలంగాణ లోనే కాకుండా దేశంలో విద్యుత్ కోసం బొగ్గు అందిస్తున్న సంస్థ కావడం మన రాష్ట్రానికి గర్వకారణమన్నారు. సుమారు 45 వేల ఉద్యోగులు సింగరేణి లో పని చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర అవసరాలకు ఇతర అవసరాలకు బొగ్గు ను సరఫరా చేస్తూ సంస్థను ఇంకా పది కాలాల పాటు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో బొగ్గు కొరత ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకొని తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 లో బొగ్గు ఉత్పత్తి చేయడానికి ప్రేయర్ అప్రూవల్ ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరగా సానుకూలంగా స్పందించినట్లు భట్టి తెలిపారు. ఒరిస్సా లోని నైని బ్లాక్ లో బొగ్గు ఉత్పత్తికి ఎదురవుతున్న పర్యావరణ అడ్డంకులను పరిష్కరించాలని కేంద్ర మంత్రిని కోరగా ఆ రాష్ట్ర సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారని భట్టి పేర్కొన్నారు.

read also : హర్యానా సీఎం ఖట్టర్ రాజీనామా .. కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ..

Hospital

గోదావరి పరివాహక ప్రాంతం తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న బొగ్గు గనులను కూడా సింగరేణి కాలరీస్ కి ఇవ్వాలని కోరగా కేంద్రమంత్రి ఇస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ని కాపాడుకోవడం ప్రభుత్వం బాధ్యతగా పెట్టుకుందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా సింగరేణి శాఖ చూడడం నాకు కలిసి వచ్చిన అదృష్టం దేవుడిచ్చిన వరం గా భావిస్తున్నా అని అన్నారు.

సింగరేణిలో గత ప్రభుత్వం ఉద్యోగాలు కోల్పోయే విధంగా నిర్ణయాలు చేస్తున్న క్రమంలో సీఎల్పీ లీడర్ గా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన సందర్భంగా అనేక బొగ్గు గనులను తిరిగానని భట్టి గుర్తు చేశారు. మార్గ మధ్యలో బొగ్గు గనుల్లో వేలాది మంది కార్మికులను కలిశానని, వారు చెప్పిన ప్రతి మాట గుర్తుపెట్టుకున్నానన్నారు.

read also : ఆధార్ అప్డేట్‌కు గడువు పెంపు .. మరో మూడు నెలలు పొడిగిస్తున్నట్టు వెల్లడి ..

సింగరేణి కి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయంలో కార్మికుల మాటలను పరిగణన లోకి తీసుకొని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నామని భట్టి తెలిపారు. మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించి బొగ్గు బావుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆరోజు చెప్పిన ప్రతి మాట ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నానన్నారు.

సింగరేణి కాలరీస్ జీఓ నెం.76 ప్రకారం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం అని భట్టి అన్నారు. మిగిలిన వారికి కూడా ఇచ్చిన మాట ప్రకారం రెగ్యులరైజ్ చేస్తాం అని తెలిపారు. ప్రజలతో మమేకమై వారి అవేదన ను నెరవేర్చాలనే సంకల్పంతో రాష్ట్ర కాంగ్రెస్ సమిష్టిగా పని చేసి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చాం అని భట్టి వ్యాఖ్యానించారు. పాదయాత్ర లో భాగంగా నడుచుకుంటూ
యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ గుట్ట పైకి వెళ్లాను ఆరోజు మనస్ఫూర్తిగా యాదగిరి లక్ష్మీనరసింహుడిని కోరుకున్న.. ఇల్లు లేని పేదలు , నిరుద్యోగ యువకుల బాధలు తీరాలంటే ఇందిరమ్మ రాజ్యం రావడానికి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకున్న.. లక్ష్మీ నరసింహుడి ఆశీర్వాదాలతో నిన్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాం అన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.