Read News in Telugu Language
adsdaksha

పగడాలు, ముత్యాలు ఖమ్మం నగరంలో అనేకమంది ఉన్నారు.. సెకెండ్ ఫేజ్ ఐటీ హబ్ కి గుంతలు తవ్వి వదిలేశారు..

దక్ష న్యూస్, ఖమ్మం : జనవరి 23

– బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దేవకీ వాసుదేవరావు ..

ఖమ్మం నగరంలో పగడాలు, ముత్యాలు అనేకమంది కబ్జాలు చేసి దర్జాగా ఉన్నారని, మొన్నటివరకు అదే పార్టీలో ఉన్న కొందరు నాయకులకు పార్టీ కండువా మార్చే వరకు కబ్జాలు కనపడలేదని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దేవకీ వాసుదేవరావు ( devaki vasudevarao ) విమర్శించారు. ఇక్కడ మంత్రిగా ఉన్న వ్యక్తి పార్టీ మారడంతో కబ్జాదారులపై చర్యలు తీసుకుంటుంటే ప్రజలు కక్ష్యపూరిత చర్యలుగా భావిస్తున్నారన్నారు. ఖమ్మం ( khammam ) జిల్లా…బీజేపీ ( bjp ) కార్యాలయంలో మంగళవారం బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా రెండవ సారి ఎన్నికైన గల్లా సత్యనారాయణకు వాసుదేవరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట కు ప్రపంచంలోని భారతీయులు, హిందువులంతా సంబరాలు జరుపుకున్నారన్నారు.

అయోధ్య బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగిన సమయంలో హింధూవులంతా కంట నీరు పెట్టుకున్నారని, ఎన్నో ఏళ్ళు కేవలం టెంటులో ఉన్న బాల రాముడు బీజేపీ కృషితో మందిరానికి వెళ్లారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కెసిఆర్ ను భద్రాచలం రాముల కళ్యాణం చేయలేదని విమర్శించేవారు, మరి నిన్న జరిగిన అయోధ్య బాల రాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కనీసం రాష్ట్రంలో సెలవు కూడా ప్రకటించలేదని దుయ్యబట్టారు.

read also : మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..

జాతీయ రహదారుల నిర్మాణం లో భాగం గా ఖమ్మం నుండి సూర్యాపేట నాలుగు లైన్స్ నిర్మాణం 2,379.24 కోట్లు సుమారు 58.626 కి.మీ పూర్తి చేశారని వాసుదేవరావు తెలిపారు. ఖమ్మం-దేవర పల్లె సెక్షన్ లో సోమవారం, చింతగూడెం గ్రామాల మీదుగా తల్లంపాడు నుండి రేపల్లె వరకు 2,770.85 కోట్లు 105 కి.మీ కేటాయించడం జరిగిందన్నారు. అమృత్ పధకం ద్వారా ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధి కొరకు రూ.105 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా ఖమ్మం జిల్లా కి 5,441 గృహాలు మంజూరి అయ్యాయని, ఉపాధిహామీ పథకం కింద 2,80,144 పనుల కోసం 1228.43 కోట్ల రూపాయలు విడుదల చేసి పూర్తి చేయడం జరిగిందన్నారు.

ప్రధానమంత్రి సౌభాగ్య యోజన పధకం ద్వారా ఖమ్మం జిల్లాలో 40,790 గృహాలకు కొత్త విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందని వాసుదేవరావు తెలిపారు. ఖేలో ఇండియా పధకం లో భాగం గా యువతను ప్రోత్సాహించి క్రీడా రంగాలలో ముందుకు తీసుకెళ్ళేవిధం గా నిధులు కేటాయించడం జరిగిందన్నారు. విశ్వ కర్మ యోజన ప్రధకం ద్వారా 18 రకాల వృత్తుల అభివృద్ధి కొరకు నిధులు కేటాయించినట్లు తెలిపారు.

read also : తెలంగాణలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి చర్యలు : ఉప ముఖ్యమంత్రి భట్టి..

దేవాలయాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేవాలయాలకు నిధులు కేటాయిస్తుందన్నారు. గతంలో ఎన్నికలు వస్తే బీజేపీ కి అయోధ్య రామ మందిరం గుర్తుకు వస్తుంది అనేవారు, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి బీజేపీ కి ప్రారంభోత్సవం గుర్తుకు వస్తుందా అంటూ విమర్శిస్తున్నారు. మీ వంటి వారికి సమాధానం చెప్పడం చెవిటి వాడి చెవులలో శంఖం ఊదినట్లే అవుతుందని వ్యాఖ్యానించారు.

Hospital

బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందని కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నిస్తున్నారని వాసుదేవరావు అన్నారు. ఖమ్మం నుండి హైదరాబాద్ కు కేవలం రెండు గంటల్లోనే ప్రయాణిస్తున్నారు కారణం బీజేపీ అన్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సెంట్రల్ లైటింగ్, రోడ్ లు రాష్ట్ర ప్రభుత్వం వేయించినట్లుగా మాట్లాడుతున్నారు వాటికి నిధులు కేటాయించింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అని గుర్తించాలన్నారు.

read also : పులకించిన భక్తజనం…మారుమోగిన రామ నామం..

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి, జిల్లాకు అడిగిన దానికంటే ఎక్కువగా నిధులు ఇచ్చిందని, కానీ ఇక్కడ గత ప్రభుత్వం కనీసం నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టలేదు అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం కరోనా వచ్చిన నాటి నుండి 5 ఏళ్ల వరకు ఉచితంగా పంపిణీ చేస్తుందని తెలిపారు.

బుగ్గపాడు ఇండస్ట్రియల్ జోన్ కి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 100 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద ఇవ్వడం జరిగిందని వాసుదేవరావు తెలిపారు. NSME కి 10 కోట్లు మంజురు చేసిందన్నారు. NSME 150 ఎకరాల్లో ప్లాటింగ్ చేసిన ఇంతవరకు అక్కడకి తయారీ సంస్థలు ముందుకు రాకపోవడం శోచనీయం .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు దృష్టి పెట్టీ ఇక్కడకు పరిశ్రమలు వచ్చేలా చేస్తే ఈ జిల్లాలో ఉపాధి పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు.

ఖమ్మం లో 50 ఏళ్ల క్రితం పెట్టిన ఇండస్ట్రిలిస్ట్, 50 యేళ్లు గడిచిన దాని అభివృద్ధికి ఎటువంటి కృషి చేయలేదన్నారు. ఖమ్మం నగరంలో కబ్జాలు చేసిన బీఆర్ఎస్ నాయకుడు పగడాల నాగరాజు ఎలా ఉన్నాడో ప్రభుత్వ భూములు ఏ విధంగా కబ్జా చేశాడో వాటిని ప్రభుత్వం ఏ విధంగా లాక్కుంది మనం చూశామని, ఇటువంటి పగడాలు, ముత్యాలు ఖమ్మం నగరంలో అనేకమంది కబ్జాలు చేసి దర్జాగా ఉన్నారన్నారు.

read also : అస్సాంలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర.. మోరిగావ్ జిల్లాలో పాదయాత్రపై ఆంక్షలు..

మొన్నటివరకు అదే పార్టీలో ఉన్న కొందరు నాయకులకు పార్టీ కండువా మార్చే వరకు కబ్జాలు కనపడలేదని వాసుదేవరావు ఘాటుగా విమర్శించారు. ఇక్కడ మంత్రిగా ఉన్న వ్యక్తి పార్టీ మారడంతో కబ్జాదారులపై చర్యలు తీసుకుంటుంటే ప్రజలు కక్ష్యపూరిత చర్యలుగా భావిస్తున్నారన్నారు. ఖమ్మం ఐటీ హబ్ కు గత ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ ప్రారంభించింది.

నేడు ఐటీ హబ్ లో పని చేసే వారి సంఖ్య కేవలం 300 మాత్రమే ఉందన్నారు. రెండవ ఫేజ్ ఐటీ హబ్ నిర్మిస్తామని గత ప్రభుత్వం గుంతలు తవ్వి వదిలితే అక్కడ నిర్మాణాలు దేవుడెరుగు గుంతల్లోకి నీరు వచ్చి చేరుతోందన్నారు. రెండవ ఫేజ్ ఐటీ హబ్ నిర్మాణం కోసం పక్కనే ఉన్న రైతు బజార్ ను కలపాలని చిన్న సన్నకారు రైతులను అక్కడినుండి ఖాళీ చేయించారని తెలిపారు. ఐటీ ఇండస్ట్రీనీ అభివృద్ధి చేయాల్సిన అవసరం స్థానిక మంత్రి పై ఉందన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.