Read News in Telugu Language
adsdaksha

అంచనాలు పెంచుతున్న దేవర .. అనిరుధ్ ట్వీట్ తో సర్వత్రా ఆసక్తి..

దక్ష సినిమా న్యూస్, డిసెంబర్ 30

త్రిపుల్ అర్ (RRR) తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న “దేవర” ( devara ) చిత్రం పై అభిమానుల అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకూ గ్లింప్స్ రిలీజ్ చేయకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Hospital

తాజాగా దేవర మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రవిచంద్రన్ టీజర్ పై x వేదికగా “దేవర” టీజర్ కోసం ఎదురు చూస్తున్నారా.. అని ఎన్టీఆర్ – కొరటాల శివ ఎమోజితో ట్వీట్ చేశారు. దీంతో దేవర టీజర్ రెడీ అయిందని అభిమానులు భావిస్తున్నారు.

ఇక ఈ టీజర్ కి అనిరుధ్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అభిమానులు ప్రేక్షకులను ఉత్కంఠగా ఎదురు చేసేలా చేస్తున్న దేవర ప్రజలను ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.

Leave A Reply

Your email address will not be published.