Read News in Telugu Language
adsdaksha

టీడీపీ నేత దేవినేని ఉమా ఇంట్లో విషాదం .. ఆయన సోదరుడు చంద్రశేఖర్ కన్నుమూత..

దక్ష న్యూస్, హైదరాబాద్: పిబ్రవరి 8

తెలుగు దేశం పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి దేవినేని ఉమా ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు చంద్రశేఖర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రశేఖర్ గురువారం తుది శ్వాస విడిచారు.

Hospital

Read also: దేశాన్ని విభజించే కుట్రలు జరుగుతున్నాయి : రాజ్యసభ ప్రసంగం లో ప్రధాని మోదీ..

ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న చంద్ర శేఖర్ హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు బుధవారం అర్థరాత్రి తీవ్ర గుండెపోటు వచ్చింది. వైద్యులు చికిత్స అందిస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చంద్రశేఖర్ మృతితో దేవినేని ఉమా ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా చంద్రశేఖర్ పార్థివ దేహాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా వారి స్వగ్రామం అయిన కంచికచర్లకు తరలించారు. ఆయన మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇవాళ సాయంత్రం కంచికచర్లలో చంద్రశేఖర్ అంత్యక్రియలు జరుగనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.