Read News in Telugu Language
adsdaksha

డీజీ రాజీవ్ రతన్ అంత్యక్రియలు పూర్తి.. హాజరైన సీఎం రేవంత్, మంత్రులు..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఏప్రిల్ 10

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ రాజీవ్ రతన్ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అన్ని అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు హాజరై నివాళులర్పించారు. రాజీవ్ రతన్ కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు.

Hospital

Read also: బీజేపీ కారిడార్లు నిర్మిస్తోంది : డీఎంకేపై ప్రధాని మోదీ విమర్శలు..

హైదరాబాద్ శివారు మహేశ్వరం మండలం తుమ్మలూరులోని మ్యాక్ బీటీఆర్ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న రాజీవ్ రతన్.. తన కుమారుడితో కలిసి మంగళవారం ఉదయం జాగింగ్ కోసం బయటికి వెళ్లాడు. 6.40 గంటలకు అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన గుండె నొప్పితో బాధపడుతున్న అతడిని కుమారుడు కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేశారు. తర్వాత కొంతవరకు రాజీవ్ రతన్ కోలుకున్నాడు. మళ్లీ నొప్పి పెరగడంతో డ్రైవర్‌ను పిలిపించి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గుండెపోటుతో ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆయన హఠాన్మరణం రాష్ట్ర పోలీసు శాఖను దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజీవ్ రతన్ పోలీసు శాఖలో ముక్కుసూటి అధికారిగా పేరు సంపాదించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.