Read News in Telugu Language
adsdaksha

బీజేపీ కి బిగ్ షాక్..

దక్ష న్యూస్, హైదరాబాద్ : అక్టోబర్ 13

మండల బిజెవైఎం అధ్యక్షుడు హరీష్ రెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ లో చేరిక..

ధర్మపురి ( dharmapuri ) నియోజకవర్గం ఎండపల్లి ( endapalli ) మండలం లో బిజెపి ( bjp ) కి భారీ షాక్ తగిలింది. మండల బీజేవైఎం ( bjym ) అధ్యక్షుడు హరీష్ రెడ్డి ( harish reddy ) సహా పలువురు ఆ పార్టీ కి రాజీనామా చేశారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ ( koppula eswar ) సమక్షంలో బిఆర్ఎస్ ( brs ) లో చేరారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులం అయి బీఆర్ఎస్ లో చేరుతునట్లు హరీష్ రెడ్డి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించు కుంటామని హామీ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల అభ్యన్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ ( cm kcr ) చేస్తున్న కృషి కి ఆకర్షితులయి నేడు ఎంతో మంది బీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారని ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.

read also : సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు ..

Hospital

ముఖ్యంగా దళిత వర్గాల ప్రజల కోసం గతంలో ఎవరూ ప్రవేశ పెట్టి అమలు చేయని పధకాలు అమలు చేస్తున్నారని మంత్రి అన్నారు. ఆసరా పెన్షన్ లతో పాటూ, విద్య వైద్య రంగాల్లో మౌలిక వసతులు కల్పించారాని చెప్పారు. ముఖ్యంగా 60 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ దళితులను ఓటు బ్యాంక్ రాజకీయాలకు వాడుకున్నది తప్ప వాళ్లకి ఎలాంటి మేలు చేయలేదని ఆరోపించారు. దళితుల కోసం సీఎం కేసిఆర్ దళిత బంధు ప్రవేశ పెట్టి ఒక్కొక్కరికి పది లక్షలు ఆర్ధిక సహాయం అందజేశారని అన్నారు. ఇది కూడా కాంగ్రెస్ రాజకీయం చేస్తూ గ్రామాల్లో ప్రజలను రెచ్చ గోడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు.

read also : పల్లా జాన్ రాములు జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరం..

అంతే కాదు బిసిలకు, మైనార్టీ వర్గాల వారికీ కూడా లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అంద చేస్తున్నట్టు మంత్రి గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలు వేసిన పిటిషన్ లతో లబ్ది దారుల అకౌంట్ లలో దళిత బంధు నిధులు జామకాలేదని.. ఎన్నికల అనంతరం తప్పని సరిగా నిధులు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పారు. అంతే కాదు రైతులు. మహిళల కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.
హరీష్ రెడ్డి అమెరికాలో ఉంటున్నా, నియోజక వర్గం అభివృద్ధి కి సహకరిస్తున్నారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ఈ సమావేశంలో పాలకుర్తి, వెల్గటూర్ ఎంపిపి లు అనసూర్య, లక్ష్మీ, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు జగన్, వివిధ గ్రామాల సర్పంచ్ లు పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.