Read News in Telugu Language
adsdaksha

అర్చకులకు శుభవార్త .. గౌర‌వ వేతనం రూ.10 వేల‌కు పెంచుతూ జీవో జారీ ..

సీఎంకి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి..

తెలంగాణ ( telangana ) రాష్ట్రంలోని అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం   (dhoopa deepa naivedyam scheme ) క్రింద గౌర‌వ వేత‌నాన్ని రూ. 6000 నుంచి రూ.10,000 కు పెంచుతూ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అందుకు సీఎం కేసీఆర్ ( cm kcr )  కి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ( indrakaran reddy )  కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఉమ్మ‌డి పాల‌న‌లో అర్చ‌కుల‌కు ధూప దీప నైవేద్య పథకం కింద రూ.2,500 మాత్ర‌మే అందేవని, అర్చకులు ఇబ్బందులు పడడం గుర్తించిన సీఎం కేసీఆర్….. రూ.2500 గౌర‌వ‌ వేత‌నాన్ని రూ, 6,000 పెంచార‌ని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.

read also : panchangamu : పంచాంగము .. రాశీ ఫలాలు

ధూప దీప నైవేద్య పధకం అర్చకుల వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000 లకు పెంచుతామ‌ని సీఎం కేసీఆర్ ప్రక‌టించిన విషయం విదితమే. ఇప్పుడు దానిని రూ 10,000 కు పెంచార‌ని పేర్కొన్నారు. వేతనం పెంపును సీఎం కేసీఆర్‌ ప్రకటించడం ఆయన గొప్ప మనసుకు నిదర్శనమ‌ని మంత్రి కొనియాడారు.

Hospital

read also : విద్యార్ధులు తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం ఎంతో అవసరం..

గ‌తంలో 1805 ఆల‌యాల‌కు మాత్ర‌మే ధూప దీప నైవేద్య ప‌థ‌కం అమ‌లు చేస్తే ద‌శల వారీగా ఈ ప‌థ‌కాన్ని మ‌రిన్ని ఆల‌యాల‌కు వర్తింప‌ చేస్తున్నామని  మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 6,541 దేవాల‌యాల‌కు ధూప దీప నైవేద్య ప‌థ‌కం అమ‌లు చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ధూప దీప నైవేద్య పథకానికి సంవత్సరానికి రూ.78. 49 కోట్లు వ్యయం అవుతుందని చెప్పారు.

read also : సెప్టెంబర్ 1 న స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలు .. హాజరవనున్న సి.ఎం కేసీఆర్ ..

Leave A Reply

Your email address will not be published.