Read News in Telugu Language
adsdaksha

ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నియమావళి అమలు..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 9

స్వేచ్ఛాయుత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రశాంతంగా ఎన్నికలు ( election ) జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఖమ్మం ( khammam ) జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( district collector v.p. gautham ) అన్నారు. సోమవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై ఎంసిసి, ఎస్ఎస్టి, ఫ్లయింగ్ స్క్వాడ్ టీములతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున సోమవారం మధ్యాహ్నం నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే తేదీ డిసెంబర్ 5 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ని ఖచ్చితంగా అమలుచేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఫ్లయింగ్ స్క్వాడ్ లను వెంటనే క్రియాశీలం చేయాలన్నారు.

read also : ఈనెల 15న ఎమ్మెల్యే అభ్యర్థులతో సీఎం కేసిఆర్ భేటీ.. బి ఫారాలను అందజేత. ..

Hospital

ఎస్ఎస్టి టీములను నోటిఫికేషన్ తేదీ నుండి యాక్టివేట్ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఓటర్లను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురిచేయడం, డబ్బు విచ్చలవిడిగా పంచడం చేయకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. నగదు కదలికలపై గట్టి నిఘా పెట్టాలన్నారు. సి విజిల్ యాప్ పై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. స్టార్ క్యాంపెనర్ వాహనాన్ని తనిఖీ చేయాలని ఆయన తెలిపారు. టీముల వాహనాలకు ఎన్నికల కమిషన్ లోగోతో పాటు, కెమెరా, జిపిఎస్ ట్రాకింగ్ ఏర్పాటుచేయాలన్నారు.

read also : కో(డ్)డి కూసేసింది.. ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల..

సమావేశంలో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, ఏసీపీ లు సంబంధిత రిటర్నింగ్ అధికారులతో సమావేశమై టీముల కు షిఫ్టింగ్ పద్ధతిన విధులు కేటాయించాలన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద నిఘా పటిష్టం చేయాలన్నారు. భద్రతా సిబ్బందికి వసతికి కేటాయించిన భవనాలు రాజకీయ పార్టీల వ్యక్తులకు సంబంధం లేనివి గుర్తించాలన్నారు. కేటాయించిన షిఫ్ట్ విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, అదనపు డిసిపి ప్రసాద్ రావు, ఆర్డీవోలు, ఎసిపిలు, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.