Read News in Telugu Language
adsdaksha

ప్రచార అనుమతులకు సువిధ పోర్టల్ లో నమోదు చేసుకోండి..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 20

కొత్త ఓట్ల నమోదుకు 30 వరకు గడువు..

– జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

జిల్లాకు కేటాయించిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు ( control unit ), వివిప్యాట్ ( v v pat ) లను మొదటి రాండమైజేషన్ ( randomization ) ప్రక్రియ ద్వారా జిల్లాలోని నియోజకవర్గాలకు కేటాయించనున్నట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( district collector v.p. gautham ) తెలిపారు. జిల్లాకు కేటాయించిన ఇవిఎం ( evm ) ల మొదటి రాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం నూతన కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాకు ఎన్నికల సంఘం నుండి 3002 బ్యాలెట్, 2390 కంట్రోల్ యూనిట్లు, 2343 వివిప్యాట్లు కేటాయించగా, ఫస్ట్ లెవల్ చెకప్ తర్వాత 2899 బ్యాలెట్, 2289 కంట్రోల్ యూనిట్లు, 2242 వివిప్యాట్ లు పనిచేసేవి గుర్తించి వాటిని జెడ్పి లోని గోడౌన్ లో పటిష్ట బందోబస్తు తో భద్రపరచామన్నారు.

జిల్లాలో 1455 పోలింగ్ కేంద్రాలు ఉండగా, ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 355, పాలేరులో 289, మధిరలో 268, వైరాలో 252, సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో 291 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నాయని కలెక్టర్ తెలిపారు. మొదటి రాండమైజేషన్ ద్వారా పోలింగ్ కేంద్రాలను బట్టి బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు తో పాటు బఫర్ గా 25 శాతంతో, వివిప్యాట్లు సంఖ్యతో పాటు బఫర్ గా 40 శాతం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి రాండమైజేషన్ వచ్చిన ఇవిఎం లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోడౌన్ నుండి తీసి, గట్టి పోలీస్ భద్రతతో సంబంధిత నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంలకు తరలించనున్నట్లు ఆయన తెలిపారు.

Hospital

read also : తెలంగాణలో ఎన్నికల నియమావళి అమలయ్యేలా చూడండి ..

3 సార్లు రాండమైజేషన్ ప్రక్రియ చేపట్టి, మూడవసారి చేపట్టిన ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల అంగీకారంతో కలెక్టర్ ఆమోదించారు. సత్తుపల్లి పట్టణంలో 190 వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఈ నెల 4న తుది పబ్లికేషన్ పిదప 16 వందల పైచిలుకు ఓటర్లు ఉండగా, ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఆక్జిలరి పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రచారం ప్రారంభం అయినందున ప్రచార అనుమతులకు సువిధ పోర్టల్ లో 48 గంటల ముందుగా దరఖాస్తులు చేయాలన్నారు.

ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ నియంత్రణకు ప్రచార ఖర్చులు ఖరారు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీలు తమ బూత్ స్థాయి ఏజెంట్ల జాబితా ఇవ్వాలన్నారు. సి విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, అందరికి అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. క్రొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు అక్టోబర్ 30 వరకు సమయం ఉన్నట్లు, ఇంకా నమోదు కానీ ఓటర్లు ఉంటే, వెంటనే నమోదు చేయించాలని కలెక్టర్ అన్నారు.

read also : వార్తను వార్తగా మాత్రమే వేయాలి .. ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్..

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీవోలు జి. గణేష్, అశోక్ చక్రవర్తి, ఎస్డీసి రాజేశ్వరి, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పసునూరి శ్రీనివాస్, బీజేపీ పార్టీ ప్రతినిధి జిఎస్ఆర్ఏ. విద్యాసాగర్, సిపిఐ(ఎం) పార్టీ ప్రతినిధి ఆర్. ప్రకాష్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు పి. దుర్గాప్రసాద్, ఎన్. సత్యంబాబు, బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి జి. కృష్ణ, టిడిపి పార్టీ ప్రతినిధి కె. కరుణాకర్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.