Read News in Telugu Language
adsdaksha

ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. తనిఖీలు నిర్వహించిన కలెక్టర్ వి.పి. గౌతమ్..

దక్ష న్యూస్, ఖమ్మం: మే 27

జిల్లాలో శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ( district collector  v.p. gautham ) తెలిపారు. ఎన్నికల్లో 67.63 శాతం పోలింగ్ జరగగా, ఇందులో 34847 మంది పురుషులు, 21881మంది మహిళలు, ఇద్దరు ట్రాన్సజెండర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 118 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసి, బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సుల ద్వారా ఓటింగ్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో సిసి కెమెరాల ఏర్పాటుచేసి, నూతన కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటుచేసి, లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళిని పర్యవేక్షణ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

read also : జలమండలి వర్షాకాల ప్రణాళిక..జీహెచ్ఎంసీ పరిధిలో డీప్ మ్యాన్ హోల్స్ కి సేఫ్టీ గ్రిల్స్ బిగింపు ..

Hospital

పోలింగ్ ముగిసిన తర్వాత జిల్లా ఎన్నికల అధికారి, రోటరీనగర్ జిల్లా పరిషత్ పాఠశాల, ఇందిరానగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల తనిఖీ చేసి, పోలింగ్ అనంతరం ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సుల సీలింగ్, రిసిప్షన్ కేంద్రానికి తరలింపు ప్రక్రియను పరిశీలించారు. పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రాల నుండి సీల్ చేయబడిన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల ఫారాలు పోలీస్ ఎస్కార్ట్ తో సెక్టార్ అధికారి పర్యవేక్షనతో ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రానికి చేరుకున్నాయి.

read also : జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి..

రిసెప్షన్ కేంద్రానికి చేరుకున్న పోలింగ్ సామాగ్రిని, రిసెప్షన్ కేంద్ర సిబ్బంది సరిచూసుకొని, పోలీస్ ఎస్కార్ట్ తో భద్రత నడుమ తెలంగాణ ఆర్టీసీ డిజిటి బస్సులలో నల్గొండ లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూంకు రవాణా చేయబడతాయని ఆయన అన్నారు. జూన్ 5న నల్గొండ లో కౌంటింగ్ ప్రక్రియ చేపట్టబడుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, జిల్లా రెవిన్యూ అధికారిణి ఎం. రాజేశ్వరి, ఆర్డీవోలు గణేష్, రాజేందర్, డిఎం సివిల్ సప్లయిస్ శ్రీలత, అధికారులు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.