Read News in Telugu Language
adsdaksha

మన వైద్యుడి చెంతకు విదేశీ పేషెంట్ లు .. వైద్యరంగంలో సంచలనం ..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 11

మరుగుజ్జుల్ని ఎత్తు పెంచడమే కాదు.. కోల్పోయిన ఎముకను తిరిగి సృష్టించగలరు..

ఆర్దోపెడిక్ వైద్యంతో అంతర్జాతీయ గుర్తింపు..

మెడికల్ కళాశాలల ప్రొపెసర్ లకే పాఠాలు..

వైద్య రంగంలో తెలంగాణ ( telangana ) కీర్తి ప్రతిష్టలు మాత్రమే కాదు, ఖమ్మం ( khammam ) నగరానికి అంతర్జాతీయ ( international ) గుర్తింపును తెస్తూ సంచలనం సృష్టిస్తున్నాడో వైద్యుడు. యాక్సిడెంట్ (accident ),  బాంబ్ బ్లాస్టింగ్ (bomb blasting ), గన్ షాట్ ( gun shot ) లు సంఘటన ఏదైనా తమ శరీరంలో కొంతభాగాన్ని కోల్పోయి జీవితమే కోల్పోయామనే భావనలోకి వెళ్ళబోతున్న బాదితులకు కావాల్సినంత గుండె ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, తన ట్రీట్ మెంట్ తో జీవితంపై కొత్త ఆశలు చిగురింపజేస్తున్నారాయన. అధునాతన సౌకర్యాలు ఉన్న విదేశాల్లో సైతం సాధ్యం కానీ కష్టతరమైన ఆపరేషన్ లు అలవోకగా చేసేస్తూ .. విదేశీ పేషెంట్ లను ఆకర్షిస్తున్నారు. దాంతో ఆప్రికా ( afrika ) వాసుల నుండి అమెరికా ( america ) బాదితుల దాకా ఆయన వైద్యం కోసం క్యూ కడుతున్నారు.

వైద్యరంగంలో తెలంగాణ ను టూరిస్ట్ హబ్ గా తీర్చిదిద్దుతామని రాజకీయ నేతలు చెప్పే మాటలు ఏమోకానీ, ఈయన మాత్రం వైద్యంపై ఉన్న మక్కువ..ప్రత్యేక శ్రద్ద, అసాధ్యాన్ని సుపాధ్యం చేయాలన్న తపనతో అద్భుతాలు సాధిస్తున్నారు. దాంతో సహజంగానే ఆ నోటా ఈ నోటా ఆయన వైద్యం గురించి విన్న పేషెంట్ లు అడ్రస్ వెతుక్కుంటూ మరీ ఆయన వైద్య శాలను ఆశ్రయిస్తున్నారు. ఆ వైద్య నారాయణుడు మరెవరో కాదు ఖమ్మం నగరానికి చెందిన ఆర్ధోపెడిక్ ( orthopedic ) వైద్యనిపుణుడు డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.వి. ప్రసాద్ ( doctor p.n.v.s.v. prasad ).

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటూ, పరిసర జిల్లాల్లో ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా, యాక్సిడెంట్ కేసుల్లో ఎముకల వైద్యం అంటే గుర్తుచ్చే మొదటి పేరే డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.వి. ప్రసాద్. అందరూ ఆయన కేవలం ఎముకల డాక్టర్ మాత్రమే అనుకుంటారు. కానీ లోతుగా ఆయన పర్సనల్ ప్రొఫైల్ అధ్యయనం చేస్తే విస్తుబోయే విషయాలు సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తాయి. నిజంగా ఇంత గొప్ప వైద్యుడు మన తెలంగాణ లో ఉన్నారా.. అదీ ఖమ్మంలో అని ముక్కున వేలేసుకోవడం ఖాయం.

ఇంతకీ ఆయన ఏం చెయ్యగలరు అంటే..

ఆర్ధోపెడిక్ వైద్యుడిగా పేరుపొందిన డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.వి. ప్రసాద్ అర్ధోపెడిక్ లో ఇలిజారో టెక్నిక్ లో నిష్ణాతుడు. ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే అతకని ఎముకల్ని, చీముపట్టిన ఎముకల్నిరిపేరు చేసి మళ్ళీ పనిచేసేలా చేయగలరు. కొంత భాగం కోల్పోయిన ఎముకల్ని మళ్ళీ ఎదిగేలా చేసి కొత్త ఎముకల్ని సృష్టించగలరు. మరుగుజ్జులను పొడుగు చెయ్యడమే కాదు.. అందం కోసం ఎత్తు పెరగాలనుకునే వారికి కాస్మొటిక్ లెంగ్జనింగ్ ప్రక్రియ ద్వారా వారి ఎత్తు పెంచగలరు. పుట్టుక తోనే ఒకకాలు పొడుగు, ఒక కాలు పొట్టిగా ఉన్న వారికి సైతం ప్రత్యేక సర్జరీ ద్వారా పొట్టి కాలు పొడవు పెంచగలరు. ఆశ్చర్యకర విషయం ఏమంటే ఈ వైద్యంలో భారతదేశం మొత్తంలో ఉన్న పదిమంది వైద్యుల్లో డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.వి. ప్రసాద్ ఒకరు.

Hospital

ప్రొపెసర్ లకే పాఠాలు ..

అరుదైన ఎముకల వైద్యం అందించడమే కాదు, ఇతర రాష్ట్రాల్లోను విదేశాల్లో జరిగే సెమినార్ లలోను తన అనుభవంతో ఈ తరహా వైద్యంలో క్లాస్ లు ఇస్తుంటారాయన. ప్రొపెసర్ లకు సైతం ప్రత్యేక తరగతులు నిర్వహించి శిక్షణ ఇవ్వడం డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.వి. ప్రసాద్ ప్ర్తత్యేకత. తెలుగు రాష్ట్రాలతో పాటూ, కేరళ, తమిళనాడు, ఇండోర్, ఢిల్లీ, మహారాష్ట్రా, కలకత్తా, మీరట్ లలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ప్రొపెసర్ లకు తరగతులు నిర్వహించడంతో పాటూ, హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రులైన అపోలో, సన్ సైన్, కిమ్స్, యశోద వంటి ఆసుపత్రుల్లో విజిటింగ్ డాక్టర్ గా వైద్య సేవలు అందిస్తున్నారు.

క్యూ కడుతున్న విదేశీ మెడికల్ టూరిస్ట్ లు..

ఆనోటా ఈనోటా ఈ వైద్య నారాయణుడి గొప్పదనం తెలుసుకున్న విదేశీయులు సైతం ట్రీట్ మెంట్ కి మొదట హైదరాబాద్ లో ఆయన విజిటింగ్ డాక్టర్ గా పనిచేసిన వైద్యశాలల్ని సంప్రదించినా, ఇప్పుడు డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.వి. ప్రసాద్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే ఖమ్మంలోని సృజన్ ఆర్దోపెడిక్ హాస్పిటల్ ని ఆశ్రయించడానికే మొగ్గుచూపుతున్నారు. దాంతో నిత్యం స్థానిక పేషెంట్ లతో పాటూ విదేశీ పేషెంట్ లు ఎవరో ఒకరు ఇన్ పేషెంట్ గా చేరడం నిత్యకృత్యంగా మారింది. గతంలో నైజీరియా (nigeria ) , సోమాలియా ( somalia ), సుడాన్ ( sudan ) నుండి వచ్చి ట్రీట్ మెంట్ చేయించుకున్న వారి ద్వారా ఆయన గురించి తెలుసుకున్న ఇతర దేశాల వాసులు తమ బంధు మిత్రులకు ఎవరికైనా అనుకోని ప్రమాదం సంభవించి ఎముకల వైద్యం అవసరమైతే ఈ ఖమ్మం వైద్యుడి పేరును సూచించడం తో, ఖమ్మానికి విదేశీ మెడికల్ టూరిస్ట్ లకు వైద్యం అందించిన ఘనత దక్కుతోంది.

అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలన్న తపనే..

మొదట అందరిలా ఎముకల వైద్య నిపుణుడిగా 1990 లో ఖమ్మంలో సృజన్ ఆర్ధోపెడిక్ ఆసుపత్రి ని ప్రారంభించిన డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.వి. ప్రసాద్, ఆర్డోపెడిక్ లో హ్యాండ్ సర్జన్ గా ప్రత్యేక గుర్తింపును సంపాదించారు. తర్వాత తన రంగంలో ఇంకా ఏదో సాధించాలన్న తపనతో ఉన్న ఆయనకు ఇలిజారో టెక్నిక్ ( ఎముకల రిపేర్ ) పై ఆసక్తి ఏర్పడింది. దాంతో 1997 రష్యా (russia ) వెళ్లి ఆ విభాగంలో అక్కడ శిక్షణ పొందారు. అంతటితో సంతృప్తి చెందక 2006 లో అమెరికా ( america ) వెళ్లి అక్కడా శిక్షణ పొందారు. 2008 లో ఇటలీ ( italy ) లో కాస్మొటిక్ లెంగ్జనింగ్ పై శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణ లకు తన పరిజ్ఝానాన్ని జోడించి ఎన్నో ప్రయోగాలు చేసి సఫలీకృతం అయ్యారు. దాంతో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆయన సొంతం అయ్యాయి. విదేశీ పేషెంట్ ల కోసం ఆయన ఎఫ్.ఆర్.ఓ. అనుమతులు సైతం పొందారు. దాంతో నిస్సంకొచంగా తన వద్దకు వచ్చే వారికి అవసరమైన వైద్యసేవలు అందిస్తూ స్వదేశానికే వన్నె తెస్తున్నారు.

read also : మానవత్వానికే కాదు దైవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ వైద్య నారాయణుడు..

Leave A Reply

Your email address will not be published.