Read News in Telugu Language
adsdaksha

పేదలు గొప్పగా బ్రతకాలనే ఆలోచనలకు ప్రతిరూపమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు..

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 21

పేదలు ఆత్మగౌరవంతో గొప్పగా బతకాలనే సీఎం కేసిఆర్ ( cm kcr ) అలోచనలకు ప్రతి రూపమే డబుల్ బెడ్ రూం ఇండ్లు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( thalasani srinivas yadav ) అన్నారు. గురువారం ఉప్పల్ ( uppal ) నియోజకవర్గ పరిధిలోని చర్లపల్లి ( charlapalli ) లో వెయ్యి మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు (double bedroom house ) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిరంతరం పేద ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం మన అదృష్టం అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభ్యత్వమే అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ప్రజలకు ఉచితంగా అందిస్తోందన్నారు.

Hospital

read also : హైదరాబాద్ లో ఎలక్ట్రిక్‌ గ్రీన్‌ మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు..

నగరంలో పేదల కోసం ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మిస్తుందని మంత్రి తెలిపారు. దశల వారిగా అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అర్హులకు ఇండ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని మంత్రి అన్నారు. మొదటి విడతలో 11,700 మందికి ఇండ్లు ఇవ్వడం జరిగిందని, 2 వ విడతలో 13,200 మందికి ఇండ్ల కేటాయింపు చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.