Read News in Telugu Language
adsdaksha

27 న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక….మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

దక్ష న్యూస్, హైదరాబాద్: సెప్టెంబర్ 23

జిహెచ్ఎంసీ ( ghmc ) పరిధిలో ఈనెల 27న డబుల్ బెడ్ రూం ఇళ్ళ (double bedroom house ) లబ్దిదారుల ఎంపికలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( thalasani srinivas yadav ) తెలిపారు. శనివారం కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ లతో సమీక్ష నిర్వహించిన మంత్రి తలసాని జిహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 2 విడతలలో 24,900 ఇండ్ల పంపిణీ పూర్తి చేసినట్లు తెలిపారు. 3,4 విడతలలో 10,500 చొప్పున 21 వేల ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

Hospital

read also : ప్రతి పేదవానికి స్వంత ఇంటి కల నెరవేర్చే దిశగా చర్యలు..మంత్రి పువ్వాడ

ఈ నెల 27 న ర్యాండో మైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా ద్వారా 21 వేల మంది లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి అన్నారు. అక్టోబర్ 2 వ తేదీన 10,500, అక్టోబర్ 5 వ తేదీన మరో 10,500 ఇండ్ల పంపిణీ ఎంతో పారదర్శకంగా రాజకీయ జోక్యం లేకుండా పార్టీలకు అతీతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.