Read News in Telugu Language
adsdaksha

3 వ విడత డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : సెప్టెంబర్ 30

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ( double bedroom house ) పంపిణీ 3 వ విడత లో కార్యక్రమంలో భాగంగా ఎంపికైన లబ్దిదారులకు అక్టోబర్ 2, 5 తేదీలలో ఇండ్లు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ( thalasani srinivas yadav ) తెలిపారు. పేద ప్రజలు ఎంతో గొప్పగా బ్రతకాలని, వారి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( cm kcr ) ఆలోచనల మేరకు 9,600 కోట్ల రూపాయల వ్యయంతో జిహెచ్ఎంసీ ( ghmc ) పరిధిలో ఎంతో విలువైన స్థలాలలో ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని తెలిపారు.

read also : రాముడైనా కృష్ణుడైనా ఆయనే..

నిర్మించిన ఇండ్లను ఎంతో పారదర్శకంగా, రాజకీయ ప్రమేయం లేకుండా, పార్టీలకు అతీతంగా ర్యాండో మైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేసి పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. మొదటి విడతలో 11,700 మందికి, రెండో విడత లో 13,200 మందికి ఇండ్లను మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేసినట్లు వివరించారు. మూడో విడతలో 36,884 మందిని ఎంపిక చేయడం జరిగిందని, వీరిలో అక్టోబర్ 2 వ తేదీన 19,020 మందికి ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. అక్టోబర్ 5 న మిగిలిన వారికి ఇండ్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

 

ఎవరెవరు ఎక్కడ పంపిణీ చేస్తారంటే..

– కుత్బుల్లా పూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్ లో హోంమంత్రి మహమూద్ అలీ 3,142 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

– చేవెళ్ళ నియోజకవర్గ పరిధిలోని శంకర్ పల్లిలో మైనింగ్ శాఖ మంత్రి మహేందర్ రెడ్డి 1361 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

– మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని మన్ సాన్ పల్లిలో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి 2099 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

Hospital

– శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని నల్లగండ్ల లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ 344 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

 

read also : వారెంట్ లేని కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో అడ్రెస్ లేకుండా చేయండి..

 

– రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని నార్సింగ్ లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి 356 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

– పటాన్ చెరువు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు -2 లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు 6067 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

– మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని అహ్మద్ గూడ లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి 1965 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

– మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని రాంపల్లి లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ 3214 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

– ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ లో విద్యా శాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి 472 మంది లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేస్తారు.

Leave A Reply

Your email address will not be published.