Read News in Telugu Language
adsdaksha

రాముని సేవలో ముఫ్ఫై వసంతాలు గా…భద్రాచలంలో ప్రజారవాణా సంస్థ : సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా.ఎ వి గిరిసింహారావ్..

దక్ష న్యూస్, భద్రాచలం : ఏప్రిల్ 15

శ్రీ రామనవమి సందర్భంగా సుదూర ప్రాంతాల్లోని ప్రజలను, భక్తులను భద్రాద్రికి చేరవేసే విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల కోసం భద్రాచలం ( bhadrachalam ) బస్టాండ్ కాంప్లెక్స్ లో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ ( rtc )  సీనియర్ మెడికల్ ఆఫీసర్ డా.ఎ.వి గిరిసింహరావు ( dr.a.v. girisimharao ) తెలిపారు. శ్రీరామనవమి ( sriramanavami ), పట్టాభిషేకం ( pattabhishekam )( 17,18 తేదీల్లో) ఈ వైద్యశిబిరం కొనసాగుతుందని వెల్లడించారు.

read also : ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించిన ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి దయానంద్.. కూలీ రూ. 400 అవుతుందని హామీ..

Hospital

మండు వేసవిని, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచామని డా.ఎ వి గిరిసింహారావ్ వివరించారు. ఈ శిభిరాన్ని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఆర్టీసీ ఉద్యోగులే కాకుండా విధి నిర్వహణ నిమిత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుండి వచ్చే ఉద్యోగులు సైతం వినియోగించవచ్చని తెలిపారు.

read also : రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాస్వామ్య పాలన : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..

ఉన్నతాధికారుల ఆదేశాలతో కార్మికుల మన్ననలతో, శ్రీ రాముడి అనుగ్రహంతో 1994 నుండి 2024 వరకు 30 పర్యాయాలు నిరాటంకంగా భద్రాచలంలో కళ్యాణం రోజు విధులు నిర్వహించడం జీవన సాఫల్య అవకాశంగా …అదృష్టంగా భావిస్తున్నామని డా.ఎ వి గిరిసింహారావ్  సంతృప్తిని వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.