Read News in Telugu Language
adsdaksha

పోరాటాలు ఉద్యమాలతోనే సామాజిక న్యాయం ప్రొఫెసర్ ప్రభంజన యాదవ్, డాక్టర్ అయేషా సుల్తానా ..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 11

ఆర్ధిక రాజకీయ సామాజిక రంగాలలో అభివృద్ధి చెందటమే కాకుండా పలు పోరాటాలు ఉద్యమాల ద్వారా మాత్రమే సామాజిక న్యాయం సాధించగలమని, తద్వారా తమ సాధికారతనూ నిలుపుకోగలరని ప్రొఫెసర్, సోషల్ జస్టిస్ జేఏసీ చైర్మన్ ప్రభంజన యాదవ్ , జాతీయ మానవ హక్కులు , న్యాయ కమిషన్ సభ్యు రాలు, జమాతే ఇస్లామీ హింద్ మెంబర్ డాక్టర్ ఆయేషా సుల్తానా అన్నారు .

శనివారం ఖమ్మంలోని హోటల్ శ్రీధర్ కాన్ఫరెన్స్ హాల్లో వీర నారి మణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ” సామాజిక న్యాయ సాధనలో మహిళల పాత్ర ” అంశంపై నిర్వహించిన సదస్సు లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రొఫెసర్ ప్రభంజన యాదవ్ మాట్లాడుతూ ఆర్యుల రాకతోనే భారత ఉపఖండంలోని మహిళల విలువలు తగ్గి అసమానతలకు గురయ్యారని తెలిపారు. ఇందులో ఆర్య బ్రాహ్మణుల పాత్ర కీలక మన్నారు. ఆర్యుల కన్నా ముందు భారత ఉపఖండంలో మాతృ స్వామిక వ్యవస్థ ఉందని, ఆనాడు మహిళా సాధికారత ఉచ్చ దశ లోఉండేదని తెలిపారు. నేటి అసమానతలు చేదించి, మహిళలు తిరిగి తమ సాధికారత నిలుపు కోవాలంటే, సామాజిక న్యాయం సాధించాలంటే పోరాటాలు, ఉద్యమాలు చేయాలని, అందుకు తమ ఇంటినుంచి మొదటి అడుగులు వేయాలని పిలుపు ఇచ్చారు.

read also : జన సంద్రమైన ఖమ్మం.. కదం తొక్కిన కమ్యూనిస్టులు.. భారీ బైక్ ర్యాలీతో విజయ వంతంగా ముగిసిన కాంగ్రెస్ ప్రచార పర్వం..

Hospital

మరో అతిథి డాక్టర్ ఆయేషా సుల్తానా మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలలో మహిళలు అధిక సంఖ్యలో తమ ఓటు హక్కును వినిగించుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయ కల్పనలో ఓటు హక్కు కూడా ఒక ముఖ్యమైన భాగం అన్నారు. విద్య ఉపాధి హార్దిక సామాజిక రంగాలలో మహిళల భాగస్వామ్యం పెరిగితే, సామాజిక న్యాయం తో పాటు మహిళా సాధికారత సాధ్యమన్నారు. దేశ సమైక్యత , సమగ్రత , మన రాజ్యాంగం , లౌకికత కాపాడే ప్రగతిశీల , ప్రజాస్వామ్య శక్తులకు, వాదులకు ఓటు వేయాల్సిన అవసరం ఉందన్నారు.

read also : ఆ రెండు పార్టీలూ ఒక తాను ముక్కలే.. కర్రు కాల్చి వాత పెట్టడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు : మంత్రి పొంగులేటి..

వీర నారీమణుల ఆశయ సాధన సమితి గౌరవ అధ్యక్షురాలు షేక్ నజీమా అధ్యక్షతన జరిగిన సదస్సులో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ కె వి.కృష్ణారావు, రిటైర్ సీఐ నాగయ్య లు ప్రసంగించగా సమితి అధ్యక్షురాలు భూక్య ఉపేంద్ర బాయి, సమితి నాయకులు జ్యోతి కృష్ణవేణి అల్లూరి నాగలక్ష్మి త్రివేణి ఉష, పావని శృతి దినకుమారి ధనలక్ష్మి కల్పన స్వరూప రాణి లలిత ఝాన్సీ రాణి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు బానోతు బద్రు నాయక్ , నాయకులు జగదీష్ , విజయ్ కుమార్ ,రవీందర్ నాయక్ ,వీరన్న నాయక్ , అనిల్ నాయక్ , పాషా ,సురేష్ శ్రీను ,రమేష్ , రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.