Read News in Telugu Language
adsdaksha

లయన్స్ క్లబ్ ఖమ్మం అధ్యక్షులుగా డాక్టర్ బొలికొండ ..

దక్ష న్యూస్, ఖమ్మం : మే 16

ఖమ్మం లయన్స్ క్లబ్ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తిరుమలాయపాలెం ( thirumalayapalem ) ప్రభుత్వ ఆసుపత్రి సివిల్ సర్జన్ ఆర్థోపెటిక్ ప్రముఖ వైద్యులు డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావును కమిటీ ఎన్నుకున్నది. లయన్స్ క్లబ్ ( lions club ) అధ్యక్షులుగా ఎన్నికైన డాక్టర్ శ్రీనివాసరావును పలువురు ప్రముఖులు అభినందించారు.

డాక్టర్ బొలికొండ సేవలు ప్రశంసనీయం..

2001లో ఖమ్మం ప్రభుత్వ వైద్యులుగా నియామకమైన డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు ( dr. bolikonda srinivasarao ) ఆనాటి నుండి నేటి వరకు ప్రజలకు అనేక సేవలు చేస్తున్నారు. ఖమ్మం ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తూ ఒదిగి ఎదుగుతూ, ఎదిగి ఒదుగుతూ అటు తనపై అధికారుల చేత ఇటు ప్రజల చేత ఆయన అందరి మన్ననలు పొంది వృత్తిలో అంచలంచలుగా ఎదిగారు. ఖమ్మం ( khammam ) ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ సర్జన్ గా, ఆర్థోపెటిక్ వైద్యులుగా తన ప్రస్తానాన్ని ప్రారంభించారు.

read also : 22 ఏళ్ల తరువాత పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక..

Hospital

2018 నుండి 2021 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా, 2015-19 వరకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా కార్యదర్శిగా, 2020 నుండి నాలుగు సంవత్సరాల పాటు ఐఎంఏ జిల్లా అధ్యక్షుడిగా ఆయన విశేషమైన సేవలు అందించారు. తెలంగాణ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఆయన ప్రస్తుతం పని చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ ఎం ఓ గా పనిచేసి జిల్లా కలెక్టర్ చేత శభాష్ అనిపించుకున్నారు.

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో మెడికల్ కాలేజీ ని ఏర్పాటు చేయడంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని జిల్లాలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులకు బదిలీ చేశారు. అందులో భాగంగానే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆర్ ఎం ఓ గా పనిచేస్తున్న డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు ను ఇటీవలనే తిరుమలాయపాలెం ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేశారు. వైద్య వృత్తిలో పేద ప్రజలకు నిరంతరం సేవలందిస్తూనే, జిల్లా అధికారులు తనకు అప్పజెప్పిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వారి మన్ననలు పొందారు.

read also : బీసీ కుల సంఘాల ఐక్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి గా రుద్రగాని మాధవ రావు గౌడ్ ..

ఐఎంఏ జిల్లా అధ్యక్షులుగా, కార్యదర్శిగా, తెలంగాణ రాష్ట్ర డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆర్ఎంవోగా పలు రంగాలలో పలు హోదాల లో పనిచేసి అన్ని వర్గాల ప్రజల చేత ఆయన మన్ననలు పొందారు. ప్రస్తుతం ఆయనను ఖమ్మం లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా నియమించడం పట్ల జిల్లాలోని పలువురు ప్రముఖులు డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావును అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.