Read News in Telugu Language
adsdaksha

జర సునో తెలంగాణకి కతా…

దక్ష న్యూస్, ఖమ్మం: జూన్ 1

జర సునో తెలంగాణకి కతా…

బాంచెన్ కాల్మొక్తా.. రోజుులు కాదు బిడ్డా.।
అమరులే కాదు..పామరులూ ప్రాణాలు లెక్కచేయని అడ్డా…।।

ఎవరో వేసిన బిచ్చం కాదు…తెలంగాణ
ఎవరో వేసిన క్వశ్చన్ కాదు….తెలంగాణ

ప్రకృతి మాత భౌగోళికంగా వడ్డించిన నిండు విస్తరి….।
కాలం కలం చారిత్రాత్మకంగా వ్రాసిన బంగరు దస్తురి…॥

ఎక్కడి నుండో పుట్టింది కాదు తెలంగాణ

అణగారిన జనం గుండె గంటల్లో…
అసువులు బాసిన వీరుల చితి మంటల్లో….

ఎవడిదో కాదు తెలంగాణ……
ఎలుగెత్తిన ఎండిన డొక్కల చప్పుళ్ళది!!
పైకెత్తిన గాయాల చేతుల గుప్పిళ్ళది!!

Hospital

తెలంగాణ భాష అంటే “బాంచన్ కాల్మొక్తా”మాత్రమే కాదు.
గొంతుకలో చేరిన గుండెలయల ప్రాస.।
శ్రమజీవులనాలుకలపై చమట చినుకుల గోస..।
తెలంగాణ…ఒక రాజకీయం…
ఒక ఆరాచకీయం కోసం కాదు.

తెలంగాణ….ఒక ఆదర్శం
ఒక ఆత్మగౌరవం కోసం….

ఎక్కడో లేదు తెలంగాణ….
ఒక పునర్నిర్మాణ కర్తవ్య కార్యాచరణలో….
ఒక విద్యుక్త ధర్మ నిర్వహణ నిబద్ధతలో …

నా తెలంగాణ….భారతీయ విజయ కౌస్తుభి-।
ప్రపంచం నినదించే కీర్తి దందుభి…॥

తెలంగాణ ఆవిర్భావం దినోత్సవ సందర్భంగా ..

సీనియర్‌ మెడికల్ ఆఫీసర్, కవి రచయిత సామాజిక వైద్య వేత్త

ఏ.వీ.గిరిసింహారావు ..

 

Leave A Reply

Your email address will not be published.