Read News in Telugu Language
adsdaksha

పగిడిపల్లి నాగేశ్వరరావు ఇంటికి కరెంట్ ఇవ్వండి : డాక్టర్ కె.వి. కృష్ణా రావు ..

దక్ష న్యూస్, ఖమ్మం: మే 3

నగరం లోని రామచంద్రయ్య నగర్ ప్రాంతం లోని పగిడి పల్లి నాగేశ్వరావు ఇంటికి కరెంట్ కనెక్షన్ ఇవ్వాలని తెలంగాణా ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె వి. కృష్ణా రావు ( dr. k.v. krishnarao ) డిమాండ్ చేశారు. శుక్రవారం ఖమ్మం ( khammam ) లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్ ఎస్ పి ( nsp ) టేకులపల్లి 2 కాల్వల ప్రాంతం పై ( రామచంద్రయ్య నగర్ ) గుడిసెలు వేసుకుని పేదలు జీవిస్తున్నారని, ఆ పేద ప్రజలకు మౌళిక వసతులు కల్పించాలని అన్నారు. కరెంట్ మీటర్ ఉండగా విద్యుత్ అధికారులు ఎలాంటి నోటీసులు జారి చేయకుండా ఆ మీటర్లను తొలగించడం తో… ఈ వేసవిలో కరెంట్ లేకపోవడం మూలంగా వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అయినా అధికారులు పట్టించు కోకపోవడం దారుణమన్నారు.

read also : కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్…

Hospital

ఉద్యమ కారులు రాంబాబు బాసాటి మాట్లాడుతూ అధికారుల వైఖరి సంజసంగా లేదని చెప్పారు. కరెంట్ మీటర్ ఉండగా తొలగించడం ఎందుకని ప్రశ్నించారు. తొలగించిన తరువాత మీటర్ పెట్టడానికి అభ్యంతరాలు ఎందుకు అన్నారు. ఎస్సీ, ఎస్టీ , బీసీ ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ భూక్యా ఉపేంద్ర బాయి, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాణోతు భద్రు నాయక్ మాట్లాడుతూ నాగేశ్వరరావు ఇంటి కరెంట్ కనెక్షన్ ను పునరుద్ధరించాలని సూచించారు.

read also : 36 కులాలను బీసీల్లో చేర్చే బాధ్యత నాదే : సీఎం రేవంత్ రెడ్డి..

రజక సంఘం నాయకుడు రేగళ్ల సీతారాములు మాట్లాడుతూ కరెంట్ మీటర్ ను తొలగించి తప్పు చేసిన అధికారులు తమ తప్పును సరి చేసుకునేందుకు మరో అవకాశం గా వెంటనే తొలగించిన స్థానంలోనే కరెంటు మీటర్ను తక్షణం బిగించాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక చైర్మన్ షేక్. నజీమా, దామల రవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.