Read News in Telugu Language
adsdaksha

ప్రాంతంలోని వాడు ద్రోహం చేస్తే పాతరేద్దాం.. ఉద్యమ కారులకు ప్రాధాన్యం ఇచ్చే కాంగ్రెస్ ను గెలిపిద్దాం..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 20

బిఎస్పీ కూడా ఉద్యమకారుల ప్రస్తావన తీసుకురాకపోవడం శోచనీయం..

తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డా. కె.వి. కృష్ణారావు..

ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తీర్మానం..

ప్రాంతేతరులు ద్రోహం చేస్తే ప్రాంతం విడిచి వెళ్లేదాకా తరిమికొట్టాలి… ప్రాంతం వాళ్ళు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతరేయాలి అని కాలోజీ నారాయణ రావు చెప్పినట్లు కేసిఆర్ ని ప్రాంతంలోనే పాతరేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డా. కె.వి. కృష్ణారావు ( dr.k.v. krishnarao ) అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ తరుపున మద్దతు ప్రకటించారు. అనంతరం దక్ష న్యూస్ తో మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క కల్వకుంట్ల కుటుంబం పోరాటం చేస్తే తెలంగాణ రాలేదన్నారు. 1200 వందలమంది విద్యార్ధుల ఆత్మబలిదానం .. సబ్బండ వర్గాల ఆకాంక్షల మేరకు సకలజనులు సమ్మె చేస్తే తెలంగాణ వచ్చిందన్నారు.

తెలంగాణ పోరాటంలో తమ జీవితాలను సైతం ఫణంగా పెట్టిన పోరాట యోధుల్ని కేసిఆర్ విస్మరించడం క్షమించరాని తప్పిదమని కృష్ణారావు అన్నారు. గడిచిన పదేళ్ళలో సీఎం గా ఉన్న కేసిఆర్ తన కుటుంబ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు పట్టించుకోలేదన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కూడా పట్టించుకోక పోవడం దుర్మార్గమన్నారు.

read also : పొంగులేటికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ మద్దతు..

Hospital

సకలజనుల ఆకాంక్షలకు ప్రతిరూపమైన తెలంగాణను ప్రసాదించిన తల్లి సోనియమ్మను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డా. కె.వి. కృష్టారావు అన్నారు. అంతే కాదు ఆమె రుణం తీర్చకునేందుకు, తెలంగాణ ను దోచుకుంటుంన్న కల్వకుంట్ల కుటుంబాన్నిరాష్ట్రం నుండి పారద్రోలేందుకు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.

తెలంగాణ ఉద్యమానికి పునాధిరాళ్ళైన ఉద్యమ కారులు గత ఐదేళ్లుగా ఒక సమాఖ్యగా ఏర్పడి ఉద్యమ కారుల సమస్యలపై సంతకాల సేకరణ చేసి, అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా, సీఎంగా ఉన్న కేసిఆర్ పట్టించుకోలేదని కృష్ణారావు ఆరోపించారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో ఫోరం కమిటీలు ఉన్నాయన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ హస్తం గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ తీర్మానించినట్లు కృష్ణారావు వెల్లడించారు. గుండు గుత్తగా కాంగ్రెస్ ని గెలిపించబోతున్నాం. ఉద్యమకారుల ఫోరమ్ మాత్రమే ఉద్యమకారుల గురించి మాట్లాడుతుందన్నారు.

జార్ఖండ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం ఉద్యమ కారులను గుర్తించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసిందని కృష్ణారావు తెలిపారు. 25 వేల పెన్షన్, బస్సు, రైలు ప్రయాణ సౌకర్యం, డబుల్ బెడ్ రూం ఇళ్ళల్లో ప్రయారిటీ, రాజకీయల్లో ఉన్నవారికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అంతిమ లక్ష్యం మాత్రం ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటేనని, అది సాధించేవరకు తమ పోరాటం ఆగదన్నారు.

read also : అభివృద్ధి కోసం పార్టీ మారిన కందళ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి..

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ను ఇవ్వడమే కాకుండా తమ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమని డా. కృష్ణారావు అన్నారు. ప్రతీ ఉద్యమకారుడికి 250 గజాలు స్థలం.. అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రతీనెలా 25 వేల రూపాయల పెన్షన్ ఇస్తామన్నారు దాన్ని మేము స్వాగతిస్తున్నాం అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే స్వేచ్చా వాయువులు పీల్చేందుకు అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఉద్యమ కారులకు గుర్తింపు ఇచ్చిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ యేనని, చివరికి బిఎస్పీ కూడా ఉద్యమకారుల ప్రస్తావన తీసుకురాకపోవడం శోచనీయమన్నారు.
కనుక ఉద్యమకారులుగా కాంగ్రెస్ పార్టీని మన భుజాలపై మోసి గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ ను గెలిపించాలని ఉద్యమకారులకు కృష్ణారావు పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.