Read News in Telugu Language
adsdaksha

బిసి బిడ్డలు కుటుంబాలకు దూరంగా బతుకుతున్నారు : డాక్టర్ కె.వి. కృష్ణారావు..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 21

గడిచిన పది సంవత్సరాలలో కెసిఆర్ బిసీ ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని డాక్టర్ కె.వి. కృష్ణారావు ( dr. k.v. krishnarao ) అన్నారు. బిసి కులాలను ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకున్నారని, బిసి ( bc ) లకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా చేశారని, బిసి బిడ్డలను విద్య నుంచి దూరం చేసే విధానాలు అవలంబించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ( congress party ) కి మద్దతు తెలుపుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా బిసి సంక్షేమ సంఘం పది నియోజకవర్గాల ముఖ్యకార్యకర్తల సమవేశం మంగళవారం ఖమ్మం ( khammam ) లో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ, కష్టపడి చదువుకొన్న బిసి బిడ్డలు ఎందరో ఉద్యోగ నియామకాలు లేక, పెళ్ళిళ్ళు కాక కుటుంబానికి భారం కాలేక పుట్టిన ఊరికి దూరంగా బతుకుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

read also : కూనంనేని లాంటి నేతలు తోడుంటే కొత్తగూడెం అభివృద్ధి బాట పట్టిస్తా ..

Hospital

మన భవిష్యత్తు బాగుపడాలంటే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కు కృతజ్ఞతగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హస్తం గుర్తుకు ఓటు వేయటమే కాకుండ పది నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్డులను అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని కృష్ణారావు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తిని మధు గౌడ్, జిల్లా నాయకులు గునగంటి వీరన్న, అరెంపుల లక్ష్మణ్, టి. రవితేజ, డి.శ్రావణ్, ఎ.బాను, శ్రీనివాసు, రాజేందర్, నాగేశ్వరావు, విరేశ్వరావు, సోమశేఖర్, రాజశేఖర్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.