Read News in Telugu Language
adsdaksha

మట్టా రాగమయికి మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 22

తెలంగాణ రాష్ట్రం వచ్చాక కెసిఆర్ కు రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టినా తెలంగాణ ( telangana ) ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారని, ఉద్యమకారులను పూర్తిగా విస్మరించారని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి. కృష్ణారావు ( dr. k.v. krishnarao ) అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ( sattupalli ) నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్టా రాగమయి ( matta ragamayi ) కి మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ అధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి. కృష్ణారావు మాట్లాడుతూ, రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన తెలంగాణ అమరవీరులను స్మరించకపోవడమే కాక వారి కుటుంబాలను ఆదుకోవాలనే జ్ఞానం ..మానవత్వం లేని దుర్మార్గుడు కెసిఆర్ అన్నారు.

బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఉద్యోగ నియామకాలు లేక నిరుద్యోగం శాతం పెరగడం, ఆరాచకాలు, అవినీతి, అన్యాయాలు దౌర్జన్యాలు, అక్రమాలు, దోపిడీ, నియంతృత్వ పోకడలు రాజ్యం మేలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ తన కుటుంబ రాజకీయ ప్రయోజనం కోసం సబ్బండవర్గాల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించటం జరిగిందన్నారు.

read also : theenmar mallanna : గూడేల్లో కేసీఆర్ ఎయిర్ అంబులెన్సులు ఏమయ్యాయి.. తీన్మార్ మల్లన్న..

Hospital

కెసిఆర్ పాలనలో ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాళేశ్వరం ప్రాజెక్ట్ మాఫియా, మీషన్ భగీరథ మాఫియా, హరితహారం మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా & పారిశ్రామిక మాఫియా ఈ విధంగా పలు రకాల మాఫియాల రూపంలో కెసిఆర్ కుటుంబం తెలంగాణ ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేశారన్నారు.

తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ 250 చ,, గజాల స్థలం ప్రకటించిందని కృష్ణారావు తెలిపారు. కాబట్టి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కు కృతజ్ఞతగా
ప్రజా తెలంగాణ కోసం ప్రతి ఉద్యమకారుడు తనవంతుగా పది ఓట్లు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు వేయించాలని, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో జిల్లా ఉద్యమకారుల ఫోరమ్ కన్వీనర్ బచ్చాల పద్మాచారి, జిల్లా ఉద్యమకారుల ఫోరమ్ నాయకులు భూక్యా రాంబాబు నాయక్, భూక్యా శ్రీనివాస్ నాయక్,బట్టు రాజేందర్ నాయక్, బెల్లంకొండ నాగేశ్వరావు,యాదగిరి చారి, సంగయ్య , సైదులు, దొడ్డ శ్రీనివాసరెడ్డి, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.