Read News in Telugu Language
adsdaksha

పొంగులేటి కి మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ మీడియా సమావేశం..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 22

నీళ్ళు నిధులు నియామకాల ప్రాతిపదికపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో ఒక్క కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎవ్వరికీ మేలు జరగలేదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి. కృష్ణారావు ( dr. K.v. krishnarao ) అన్నారు. పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి మద్దతుగా తిరుమలాయపాలెంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణారావు మాట్లాడుతూ కెసిఆర్ కు రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టినా తెలంగాణ ప్రజల కు ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారన్నారు.
ఉద్యమకారులను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన తెలంగాణ అమరవీరులను కూడా స్మరించకపోవడమే కాక వారి కుటుంబాలను గాలికి వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read also : మట్టా రాగమయికి మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్..

రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పట్టించుకోని కేసీఆర్ కి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని కృష్ణారావు అన్నారు. తెలంగాణను ఇచ్చిన సోనియమ్మ కు కృతజ్ఞతగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ని గెలిపించి దోపిడీ పాలకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.

Hospital

పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కృష్ణారావు కోరారు.
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ 250 చ. గజాలు స్థలం ప్రకటించిందని అన్నారు.

Read also : బిసి బిడ్డలు కుటుంబాలకు దూరంగా బతుకుతున్నారు : డాక్టర్ కె.వి. కృష్ణారావు..

ప్రజా తెలంగాణ కోసం ప్రతి ఉద్యమకారుడు తనవంతుగా ఒక్కొక్కరూ పది ఓట్లు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు వేయించాలని కృష్ణారావు అన్నారు. తద్వారా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో జిల్లా ఉద్యమకారుల ఫోరమ్ కన్వీనర్ బచ్చాల పద్మాచారి, జిల్లా ఉద్యమకారుల ఫోరమ్ నాయకులు భూక్యా రాంబాబు నాయక్, భూక్యా శ్రీనివాస్ నాయక్,బట్టు రాజేందర్ నాయక్,,కాంగ్రెస్ నాయకులు ఇజ్రాయిల్, ఎస్ డి సైదా, పిడమర్తి రాజేశ్ ,పెరుగు బిక్షం, బెల్లంకొండ నాగేశ్వరావు,యాదగిరి చారి, సంగయ్య , సైదులు దొడ్డ శ్రీనివాసరెడ్డి, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.