Read News in Telugu Language
adsdaksha

పొంగులేటికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ మద్దతు..

దక్ష న్యూస్, ఖమ్మం: నవంబర్ 20

ప్రతి ఉద్యమకారుడు తనవంతుగా పది ఓట్లు కాంగ్రెస్ కి వేయించాలి : డా.కె.వి.కృష్ణారావు..

కేసిఆర్ ( kcr ) కు ప్రజలు రెండు సార్లు అధికారాన్ని కట్టబెట్టినా తెలంగాణ ప్రజల ప్రయోజనాలను గాలికి వదిలేశారని తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.వి. కృష్ణారావు ( dr.k.v. krishnarao ) అన్నారు. సోమవారం ఖమ్మం ( khammam ) జిల్లా పాలేరు ( paleru ) నియోజకవర్గ కాంగ్రెస్ ( congress ) పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( ponguleti srinivas reddy ) కి మద్దతుగా తెలంగాణ ( telangana ) ఉద్యమకారుల ఫోరమ్ అధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ, కేసిఆర్ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించారన్నారు.

Hospital

read also : అభివృద్ధి కోసం పార్టీ మారిన కందళ ప్రజలకు ఏం చేశారో చెప్పాలి..

కేసిఆర్ పాలనలో లాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాళేశ్వరం ప్రాజెక్ట్ మాఫియా, మిషన్ భగీరథ మాఫియా, హరితహారం మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఇసుక మాఫియా & పారిశ్రామిక మాఫియా ఈ విధంగా పలు రకాల మాఫియాల రూపంలో కేసిఆర్ కుటుంబం తెలంగాణ ఖజానాను ఖాళీ చేసి రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల రూపాయలు అప్పుల పాలు చేశారని కృష్ణారావు అన్నారు. దీని ఫలితంగా
ప్రతి పౌరుడి నెత్తిమీద ఒక లక్షా పాతిక వేల రూపాయల అప్పు భారం పడుతుందన్నారు. కనుక తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ కు కృతజ్ఞతగా
ప్రజా తెలంగాణ కోసం ప్రతి ఉద్యమకారుడు తనవంతుగా పది ఓట్లు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు వేయించాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతీ వ్యక్తి కృషి చేయాలని కృష్ణారావు విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో జిల్లా ఉద్యమకారుల ఫోరమ్ కన్వీనర్ బచ్చాల పద్మాచారి, జిల్లా ఉద్యమకారుల ఫోరమ్ నాయకులు భూక్యా రాంబాబు నాయక్, భూక్యా శ్రీనివాస్ నాయక్, బట్టు రాజేందర్ నాయక్, బెల్లంకొండ నాగేశ్వరావు, యాదగిరి చారి, సంగయ్య , సైదులు దొడ్డ శ్రీనివాసరెడ్డి, షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.