Read News in Telugu Language
adsdaksha

మానవత్వానికే కాదు దైవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ వైద్య నారాయణుడు..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 8

 

తలసేమియా చిన్నారుల్లో చిరునవ్వులు పూయిస్తున్న బాలల బంధువు..

అద్భుత హస్త వాసే కాదు.. దూర దృష్టి తోను సేవలు..

వైద్యమే కాదు.. విధి వంచితులకు బాసట..

వైద్యం వృత్తిగా.. సేవ ప్రవృత్తిగా అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు..

సేవా మంత్రం.. క్రీడా చైతన్యం రగిలిస్తూ యువతను ప్రోత్సహిస్తున్న వైనం..

వైద్యో నారాయణ, హరి అన్నారు మన పెద్దలు. వైద్యుడు అంటే నారాయణుడు విష్టుమూర్తి తో సమానం. వైద్యం అంటే కేవలం దేహానికి మాత్రమే చేసేది కాదు. అది సమాజానికి వర్తిస్తుంది. ఎక్కడ ఏ సమాజం మానసికంగా జబ్బున పడుతుందో.. ఏ వ్యవస్ధ బలహీనంగా మారి అభివృద్ధికి దూరంగా ఉంటుందో అన్నింటికి అవసరమైన వైద్యం అందించేవాడే నారాయణుడు. ఒక్క సారి ఆ నారాయణ మూర్తి స్పురదృక్కులు ప్రసరిస్తే చాలు.. ఎంతటి సమస్య ఉన్న దేహమైనా, సమస్య అయినా పరిపూర్ణ స్వస్థత పొందాల్సిందే.

మనుషుల్లోను అలాంటి వైద్య నారాయణుడు ఉన్నాడంటే నమ్ముతారా.. కానీ నమ్మాల్సిందే ఇది సత్యం. ఇది సత్య కాలం కాదు, కలికాలం అయినప్పటికీ ఈ భూమ్మీద ఎక్కడోచోట కారణజన్ములు ఉండబట్టే ధర్మం కనీసం ఎలాగోలా కాలం వెళ్ళదీయగలుగుతోందనానికి ఇలాంటి వారే తార్కాణం. అలాంటి వైద్యనారాయణుడు మన మధ్య ఎక్కడున్నాడబ్బా అని ఆలోచిస్తున్నారా..

ఖమ్మం జిల్లాలోని చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రుల్ని ఎవరినైనా అడిగిచూడండి మీ పిల్లలకు ఏ డాక్టర్ అంటే ఇష్టం అని. లేదా తలసేమియా మహమ్మారితో పోరాడుతున్న ఏ పసిహృదయాన్నయినా ప్రశ్నించి చూడండి మీ మనుగడ ఎలా సాధ్యమవుతుందని. కరోనా కష్ట కాలంలో కుటుంబాలు గడవడం కష్టంగా మారిన సమయంలో గుప్పెడు మెతుకుల కోసం ఎదురు చూసిన అభాగ్యుల కళ్ళల్లో ఆనందం నింపిన వారెవరని ఏ రోడ్డుపక్కన ఉన్న విధివంచితులనడిగినా చెపుతారు ఆయన పేరు.

కడు పేదరికంతో చదువుకి దూరమవబోతున్న తమను అన్నలా అక్కున చేర్చుకొని తమకు చదువు చెప్పిస్తున్న దెవరని ఏ పేదింటి చెల్లెమ్మ నడిగినా చెపుతుంది ఆ అన్న పేరు. అంతేకాదు ఆడపిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా మహిళా టోర్నమెంట్ లు నిర్వహిస్తూ ఖమ్మం గుమ్మాన్ని జాతీయ, అంతర్జాతీయ క్రీడా వేదికగా నిలిపింది ఎవరనేది ఏ క్రీడా కారులను అడిగినా ఇట్టే చెప్పేస్తారు.

read also : ప్రంపంచ స్థాయిలో నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ ను తీర్చిదిద్దుతాం..

వృత్తి పిల్లల వైద్యుడిగా ప్రవృత్తి సమాజ సేవగా తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసి నిత్యం సామాజిక సేవలో పునీతుడవుతున్న ఆవైద్య నారాయణుడు మరెవరో కాదు ఖమ్మం నగరానికి చెందిన పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ( dr. kurapati pradep kumar ).

ఖమ్మం వైరా రోడ్ లోని కూరపాటి పిల్లల వైద్య శాల వైద్యుడిగా గత దశాబ్దకాలంగా చిన్నారులకు వైద్యసేవలు అందిస్తున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ తన వద్దకు వచ్చే పసిపిల్లలతో మమైకమయ్యే విధానం ముచ్చట గొలుపుతుంది. పిల్లల్ని పలకరిస్తూ.. ఆడిస్తూ వారితో పాటూ అల్లరిచేస్తూ వారిలో హాస్పిటల్ కి వచ్చానన్న భయం పోగొట్టి వారికి వైద్యం అందిస్తారు. అందుకే ఆయనంటే పిల్లలకు ఎంతో ఇష్టం. ఖమ్మం జిల్లా నుండి మాత్రమే కాదు పరిసర జిల్లాల వాసులు తమ పిల్లలకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా డా.కూరపాటి పిల్లల వైద్య శాలను ఆశ్రయించడం ఆయన గొప్పదనానికి నిదర్శనం.

సేవల్లో ఘనాపాఠి..

Hospital

ఖమ్మం నగరానికి చెందిన కూరపాటి వెంకటేశ్వరరావు హైమావతి దంపతులకు రెండో సంతానమైన డాక్టర్ ప్రదీప్ కుమార్ తనకు విదేశాలకు వెళ్లి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉన్నా, కేవలం తన సొంత గడ్డపై ఉన్న మమకారంతో ఖమ్మంలోనే స్థిరపడ్డారు. వృత్తి వైద్యుడిగా.. ప్రవృత్తి సంఘ సేవకుడిగా తన బాద్యతలు నిర్వర్తిస్తున్నారు. క్రీడా రంగం పై ఆసక్తితో క్రీడాకారులైన యువతకు చేయూత నందించే లక్ష్యంతో 2019 లో యువం పౌండేషన్ స్థాపించి ప్రతీ యేటా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలో డే అండ్ నైట్ అంతర్జాతీయ మహిళా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి సంచలనం గా నిలిచారు. సీనియర్, సబ్ జూనియర్, జూనియర్ ఫవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించి యువ క్రీడాకారుల్లో ఉత్తేజం నింపారు. బాస్కెట్ బాల్ పోటీలు నిర్వహించి ఎందరో గ్రామీణ క్రీడాకారుల్ని ప్రోత్సహించారు. 2015లో నిర్వహించిన జాతీయ బాలోత్సవ్ తో చిన్నారుల్లోని ప్రతిభాపాటవాల్ని వెలికితీశారు. ఇలా చెప్పుకూంటూ పోతే ప్రదీప్ కుమార్ గొప్పదనాన్ని చాటే పెద్దలిస్టే తయారవుతుంది.

కదం తొక్కిన యువం సైన్యం..

యువతలో సేవా నిరతి, సమాజిక సృహ పెంపొదిస్తూ సమాజసేవలో వారిని భాగస్వాములను చేసే లక్ష్యంతో స్థాపించిన యువం పౌండేషన్ లో 2500 మంది యువత స్వచ్చందంగా సేవలందించడం విశేషం. ఈ క్రమంలో యువం కోసం తన సమయాన్నే కాదు తన సంపాదనను వెచ్చించే డాక్టర్ ప్రదీప్ కుమార్ కరోనా కష్ట కాలంలో అందించిన సేవలు చిరస్మరనీయం. తన యువదళంతో లాక్ డౌన్ సమయంలో మాస్క్లులు, శానిటైజర్ల పంపిణీ నుండి కరోనా బాదితులకు పోషకాహారం పంపిణీ వరకు స్వయంగా పాల్గొన్న ప్రదీప్ కుమార్, రెండు సార్లు కరోనా బారీన పడ్డారు. అయినా అంతులేని ఆత్మవిశ్వాసంతో తిరిగి కోలుకొని రెట్టించిన ఉత్సాహంతో సేవలు అందించారు.

read also : ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ రీతు వర్మ..

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఉచిత భోజనం, వలస కూలీలకు సహాయ సహకారాలు, మూడు పూటలా భోజనం, నిరుపేదలకు నిత్యావసరాల పంపిణీ, ప్రైవేట్ ఉపాధ్యాయులకు మూడు నెలలకు సరిపడ సరుకుల పంపిణీ చేశారు. అంతేకాదు, లాక్ డౌన్ సమయంలో పనులు లేక కుటుంబ పోషణ కష్టమై ఆకలితో అల్లాడుతున్న కళాకారులకు, సినీ రంగ కార్మికులకు చేయూత నందిస్తూ వారిని ఆదుకున్నారు. క్రిస్మస్, రంజాన్ పర్వదినాల్లో ఆయా సామాజిక వర్గాల ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసి మత సామరస్యాన్ని చాటారు.

విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ సేవలు..

తలసేమియా చిన్నారులకోసం డాక్టర్ ప్రదీప్ కుమార్ నెలకొల్పిన విజయశ్రీ బ్లడ్ బ్యాంక్ లో కరోనా సమయంలో ప్లాస్మా సేకరణ ద్వారా ఎందరో ప్రాణాలను నిలబెట్టారు. ప్రదీప్ కుమార్ సేవల్ని గుర్తించిన అప్పటి కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ స్వయంగా ప్లాస్మా సేకరణకు ప్రదీప్ కుమార్ ను సంప్రదించడం ఆయన సేవా నిరతికి నిదర్శనం.

పేదింటి ప్రతిభకు పట్టం..

నిరుపేద కుటుంబాల్లోని ప్రతిభావంతులైన చిన్నారులు చదువుకు దూరం కారాదన్న తపనతో డాక్టర్ ప్రదీప్ కుమార్ శ్రీకా అనే విభాగానికి తన స్కూల్ మేట్స్ అయిన 15 మందితో కలిసి శ్రీకారం చుట్టారు. ఈ బృహత్తర ఆశయానికి ప్రభుత్వ గుర్తింపు లభించడంతో ఆ ఎన్జీఓ సంస్థకు ప్రదీప్ అధ్యక్షుడిగా ఉన్నారు. సొసైటీ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ నినాదంతో పేదింటి విద్యను బతికించాలనే సత్ సంకల్పం ఇప్పటికి 13 మంది విద్యార్ధులను చదివిస్తోంది. అందులో ఒకరు ఎంబీబిఎస్ విద్యను అభ్యసిస్తుండడం గొప్పవిషయం.

అవార్డుల పంట..

డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ అందిస్తున్న సేవలకు గుర్తుగా జాతీయస్థాయిలో కేతన్ దేశాయ్ యంగ్ లీడర్ అవార్డు లభించడం చెప్పుకోదగ్గ విషయం. అంతేకాదు పిల్లల వైద్య నిపుణుడిగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ గుర్తింపు లభించింది. అతి చిన్నవయసులో ఖమ్మం ఐఎంఏ సెక్రెటరీ పదవి లభించడమే కాదు, స్టేట్ ఐఎంఏ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాంచ్ గుర్తింపును ఇచ్చింది. దాంతో జాతీయస్థాయి పత్రికలు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ సేవలను కీర్తిస్తూ కవర్ పేజీ కథనాలు రాశాయి. 2017లో అందుకున్న ఫిలం థ్రోపిక్ సొసైటీ పాండిచ్చేరి (యానాం) వారిచే విశిష్ట సేవా పురస్కార్ అవార్డు, అదే సంవత్సరం అందుకున్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ వారి బెస్ట్ మోటివేటర్ అవార్ఢు, 2018,2019 వరుసగా రెండు సార్లు అందుకున్న ఉత్తమ వైద్యుడి అవార్డులు, 2018 లో చైల్డ్ లైన్ వారి బాలబంధు అవార్డు, 2018- 19 లో బాలోత్సవ్ దిగ్విజయంగా నిర్వహించనందుకు లభించిన సేవారత్న అవార్డు, 2020సం.లో తెలంగాణ సర్కార్ వైద్య రత్న అవార్డు, 2022 లో లభించిన ఐకాన్ ఆఫ్ ఇండియా అవార్డు తన బాద్యతను రెట్టింపు చేశాయని చెపుతున్న డాక్టర్ ప్రదీప్ కుమార్ కి 2021-22 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం తరుపున ఇంటర్ నేషనల్ హెల్త్ కేర్ కాన్ఫరెన్స్ లో ఎక్స్ లెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రదీప్ ఈ అవార్డును అందుకున్నారు. అంతేకాదు 2022 సంవత్సరానికి గాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ డోనర్ డే సందర్భంగా సేవా అవార్ఢు ను అందించి గౌరవించింది.

 

Leave A Reply

Your email address will not be published.