Read News in Telugu Language
adsdaksha

హార్మోన్ల సమతుల్యత లోపమే అనారోగ్యానికి కారణం.. జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 24

గీతం కళాశాలలో  ఘనంగా జాతీయ బాలిక దినోత్సవం..

హార్మోన్ల సమతుల్యత లోపమే అనారోగ్యానికి అసలు కారణమని సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి ( dr.pradeep reddy ) అన్నారు. పాలిసిస్టిక్ ఓవర్ సిండ్రోం ద్వారా ప్రభావితమైన వారిలో హార్మోన్ సమతుల్యత లోపించడం ద్వారా పురుష హార్మోన్లు సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతాయని అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ పంచాయతీ పరిధిలోని గీతం విశ్వవిద్యాలయంలో బుధవారం జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పీసీఓడీ అనే అంశంపై డాక్టర్ ప్రదీప్ రెడ్డి అతిథి ఉపన్యాసం చేశారు. బాలికలలో హార్మోన్ల సమతుల్యత లోపం కారణంగా రుతుక్రమం తప్పడం బరువు పెరగడం అధిక జట్టు పెరుగుదల, మొటిమలు, అండాశయం తిత్తులు తదితర ప్రభావాలు ఏర్పడతాయని అన్నారు.

read also : ఖర్గే హైదరాబాద్ పర్యటనను జయప్రదం చేయాలి : డిసిఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల

Hospital

చర్మ సమస్యలకు సైతం హార్మోన్ల లోపమే కారణమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. మహిళల్లో పాలిసిస్టిక్ ఓవర్ యాన్ డిసీజ్ వాటి ప్రభావం తదితర అంశాల గురించి అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బిసి బోస్ ప్రారంభంలోనే రోగనిర్ధారణ నిర్వహణల ప్రాముఖ్యతను డాక్టర్ దువ్వూరు నొక్కి చెబుతూ సంతనోత్పత్తి పైన సైతం హారం హార్మోన్ లోపం కనబడుతుందని అన్నారు. గుండె ఆరోగ్యం పైన సైతం అత్యధికంగా హార్మోన్ల సమతుల్య లోపం కారణంగా జరుగుతుందన్నారు. శారీర వ్యాయామం సరైన ఆహారం తగిన ఔషధాలు తీసుకోవడం ద్వారా కొంతవరకు హార్మోన్ల సమతుల్యత సరిచేసుకోవచ్చని అన్నారు.
ధూమపానం మద్యపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ సమస్యను తోటి విద్యార్థులు స్నేహితులు కుటుంబ సభ్యులు వైద్యులతో పంచుకోవాలని ఈ సందర్భంగా డాక్టర్ ప్రదీప్ రెడ్డి సూచించారు.

read also : మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది..

వీలైనంత త్వరగా ఈ సమస్యను తగ్గించుకోవడం మంచిదని డాక్టర్ ప్రదీప్ రెడ్డి అన్నారు. హార్మోన్ల సమతుల్యత లోపించకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వైద్య నిపుణుడి నుండి మహిళా ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవడానికి అవగాహన పొందడానికి నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన తగిన జవాబులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గీతం కళాశాల చెందిన అధ్యాపకులు, విద్యార్థిని విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.