Read News in Telugu Language
adsdaksha

2 నుంచి 6 వరకు యథావిధిగా ప్రజాపాలన గ్రామసభలు..

దక్ష న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: జనవరి 1

– భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా. ప్రియాంక..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన ప్రజాపాలన గ్రామ సభలు జనవరి 2 నుండి 6 వరకు నిర్వహించి ప్రజల నుండి ప్రభుత్వం నిర్దేశించిన ఆరు గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించాలని భద్రాద్రి కొత్తగూడెం ( bhadradri kottagudem ) జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ( dr. priyanka ala ) అధికారులను ఆదేశించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ప్రజల నుండి ప్రభుత్వం నిర్దేశించిన పథకాల యొక్క దరఖాస్తుల స్వీకరించాలని ఆమె సూచించారు.

read also : ఖమ్మం జిల్లాలో నేటి ప్రజాపాలన షెడ్యుల్ ఇదే..

దరఖాస్తుల స్వీకరణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు రసీదు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదులు చేయాలని కలెక్టర్ చెప్పారు.

Hospital

read also : 2న శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం ..

నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతి, మున్సిపాలిటీలల్లో గ్రామ సభలు నిర్వహించాలని చెప్పారు. రెండు రోజులు ప్రభుత్వ సెలవుల అనంతరం గ్రామ సభలు నిర్వహిస్తున్నందున దరఖాస్తు చేయడానికి ప్రజలు అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదని, మహిళలకు, వయోవృద్దులకు, దివ్యాంగులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేయాలని అన్నారు.

read also : Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం..

దరఖాస్తులు పూరించేందుకు హెల్ప్ డెస్క్ లు, ఏర్పాటు చేసి, ఇతర ప్రభుత్వ సిబ్బంది ప్రజలకు తగు సూచనలు సలహాలు ఇవ్వాలని చెప్పారు. దరఖాస్తు నిశిత పరిశీలన చేయాలని పూరించని ఖాళీలుంటే సమగ్ర సమాచారం తెలుసుకుని పూరించాలని కలెక్టర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.