Read News in Telugu Language
adsdaksha

ఖమ్మం పులిపాటి నగర్ 2లో తపాలా పోస్ట్ బాక్స్ సేవలు ప్రారంభం..

దక్ష న్యూస్, ఖమ్మం : ఫిబ్రవరి 14

తపాలాశాఖ సేవలు విస్తృతమయ్యాయని, తపాలాశాఖ ఉమ్మడి ఖమ్మం జిల్లా సూపరింటెండెంట్ రవికుమార్ అన్నారు. బుధవారం ఖమ్మం ( khammam ) జిల్లా కేంద్రంలోని గొల్లగూడ రోడ్డులోని మమత మెడికల్ కాలేజీ సమీపంలోగల పులిపాటి నగర్2 ( pulipati nagar – 2 ) లో డాక్టర్ పులిపాటి ప్రసాద్ ( dr. pulipati prasad ) ఆధ్వర్యంలో తపాల శాఖ నూతన పోస్ట్ బాక్స్ సేవలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత 30 సంవత్సరాల క్రితం గూగుల్, ఈ-మెయిల్ కంప్యూటర్ లు ఉండేవి కాదని, ఆ రోజుల్లో పోస్ట్ కార్డు ఉత్తరాలు, ఎన్వలప్ కవర్లతో ప్రారంభమైన తపాలాశాఖ నేడు బ్యాంకింగ్ రంగంలో సేవింగ్స్ లో కూడా బ్యాంకింగ్ సెక్టార్ కు తీసిపోనీ విధంగా సేవలందిస్తూ వినియోదారుల మన్ననలు పొందుతూ వస్తోందన్నారు.

read also : ఘనంగా వసంత పంచమి.. కిటకిటలాడిన ఆలయాలు..

Hospital

ఈప్రాంత వాసులకు పోస్టల్ సేవలు విస్తృత పరిచేందుకు సామాజిక సేవకులు, పౌర సమితి అధ్యక్షులు, మహాత్మా గాంధీ ఫౌండేషన్ చైర్మన్, డాక్టర్ పులిపాటి ప్రసాద్.. ఆధ్వర్యంలో…నూతన పోస్ట్ బాక్స్ సేవలు ప్రారంభించడం హర్షనీయమని రవికుమార్ అన్నారు. ఈసందర్భంగా డాక్టర్ పులిపాటి ప్రసాద్ ను ప్రత్యేకంగా అభినందించారు.

read also : భక్తులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త .. మేడారం ప్రసాదం హోం డెలివరీ : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ..

అనంతరం డాక్టర్ పులిపాటి ప్రసాద్ మాట్లాడుతూ, తపాలాశాఖ సేవలను విస్తృత పరిచేందుకు మాప్రాంతంలో పులిపాటి నగర్ 2లో ఈకార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, తపాలశాఖ సూపరింటెండెంట్ రవికుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వాసిరెడ్డి నాగేశ్వరరావు, గుమ్మడివల్లి శ్రీనివాస్, గోల్ల రాధాకృష్ణమూర్తి, సిద్ధంశెట్టి శ్రీకాంత్, కోదుమూరి భద్రయ్య, మాసేటి వర ప్రసాద్ రావు, వెల్లంపల్లి వెంకటసుబ్బయ్య, వైఎన్.రామకృష్ణమూర్తి, వంశీ, శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, పెనుగొండ సూర్యప్రకాష్ రావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.