Read News in Telugu Language
adsdaksha

క్యాన్సర్ ఇప్పుడు ప్రాణాంతకం కాదు.. అత్యాధునిక టెక్నాలజీ తో అరుదైన వైద్యం : డాక్టర్ రాజేందర్..

దక్ష న్యూస్, ఖమ్మం : జూన్ 5

ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ కి ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక టెక్నాలజీ తో అరుదైన వైద్యం అందుబాటులోకొచ్చిందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సర్జికల్ అంకాలాజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ రాజేశ్ గౌడ్ అన్నారు. బుధవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం భాగ్యనగరి తండా కు చెందిన ఏడాది చిన్నారి షేక్ అబ్దుల్ ఇషాన్ అనే బాలుడికి చేసిన అరుదైన క్యాన్సర్ చికిత్స గురించి వివరించారు.

చిన్నారి ఇషాన్ కడుపు నొప్పి, బరువు పెరగకపోవడం, విరేచనం కాకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుండడంతో అతని తల్లిదండ్రులు పలు
హాస్పిటళ్లకు తిరిగి చివరకు తమ వద్దకు వచ్చారని డాక్టర్ రాజేష్ తెలిపారు. బాబుకు పరీక్షలు నిర్వహించగా కడుపులో 2.5 కేజీల కణితి ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనితో బయాప్సి చేయగా క్యాన్సర్ అని తేలిందన్నారు. కాంప్ర హెన్సివ్ క్యాన్సర్ కేర్ విత్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ లో భాగంగా కీమో థెరపీ చేసి కణితి ని కరిగించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సహాయంతో బ్లాడర్ వాల్ తో కణితి ని రిమూవ్ చేసినట్లు తెలిపారు. అదే విధంగా యూరిన్, మోషన్ కెళ్లే నరాలను ప్రిజర్వ్ చేసి సర్జరీ చేయడంతో బాలుడు కొలుకున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో నే డిస్సార్జి చేశామన్నారు. ఇప్పుడు బాబు నార్మల్ గానే యూరిన్ కెళ్తున్నాడని ,ఇబ్బంది లేదని తెలిపారు. ఇప్పుడు ఆ చిన్నారి మాములు పిల్లల్లాగే సాధారణ జీవనం గడపవచ్చన్నారు.

read also : క్రికెట్ ప్రియులకోసం ఎయిర్ టెల్ సరికొత్త ప్లాన్ లు.. ఇన్-ఫ్లైట్ కనెక్టివిటీతో రోమింగ్ ప్యాక్‌లు..

Hospital

క్యాన్సర్ పేరు వినగానే వణికిపోయి ఆ టెన్షన్ తో అనారోగ్యాన్ని పెంచుకునే రోజులు పోయాయని డాక్టర్ రాజేష్ గౌడ్ అన్నారు. ఎటువంటి
క్యాన్సర్ కైనా యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్ లో వైద్యం అందుబాటులో ఉందని తెలిపారు. ముందుగా నే క్యాన్సర్ ను గుర్తించడం ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీ వైద్యం ద్వారా తగ్గించవచ్చని తెలిపారు.

అందివచ్చిన ఆధునిక టెక్నాలజీ సాయంతో సంబంధిత వైద్య బృందం సమన్వయంతో రోగులకు ముందుచూపుతో వైద్యాన్ని అందిస్తూ క్వాలిటీ లైఫ్ అందిస్తున్నామని డాక్టర్ రాజేష్ గౌడ్ అన్నారు.

read also : రోహిత్ శర్మ అరుదైన ఘనత.. ప్రపంచ కప్ నుండి ఐర్లాండ్ మ్యాచ్ దాకా..

చిన్నారి ఇషాంక్ తండ్రి షేక్ సయ్యద్ మాట్లడుతూ తమ బాబుకు కడుపులో గడ్డతో అనేక అవస్ధలు పడుతూ హైదరాబాద్ లో ఎన్నో హాస్పిటల్ లు తిరిగామన్నారు. చికిత్స తర్వాత తమ బాబు కోలుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తమ బాబుకు చికిత్స అందించిన వైద్య బృందానికి ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.