Read News in Telugu Language
adsdaksha

డాక్టర్ శీలం పాపారావు.. మనలో ఒకరు..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 30

రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం వైద్యుడు.. మార్పు దిశగా బిజేపి అడుగులు..

తండ్రి స్వీట్ మాస్టర్ .. తల్లి గృహిణి..

శాంతి నగర్ పాఠశాలలో విద్యాబ్యాసం..

ఈటెల సావాసంతోనే బిజేపిలోకి..

బీసీ నేతకు సపోర్టుగా బిజేపి నేతలు.. మద్దతు ఇస్తామంటుంన్నపలు సంఘాలు..

డాక్టర్ శీలం పాపారావు ( dr. seelam paparao ) తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఖమ్మం ( khammam ) లో తరచు వినిపిస్తున్నపేరు ఇది. తెలంగాణ ( telangana ) మెడికల్ జేఏసి కో కన్వీనర్ గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలిసారి గళం విప్పిన ఆయన, తదనంతర పరిణామాల్లో అనుకోకుండా రాజకీయ గాలివాటుకు కొట్టుకుపోతూనే.. తన రాజకీయ గురువు ఈటెల రాజేందర్ ( etela rajender ) సాన్నిహిత్యంతో అనుకోకుండానే బిజేపి ( bjp ) లోకి అడుగుపెట్టారు. కేవలం ఈటెల పై ఉన్న నమ్మకంతోనే బిజేపి కండువా కప్పుకున్నా, సనాతన ధర్మం, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పెద్దపీఠ వేసే బిజేపి సిద్దాంతాల పట్ల ఆకర్షితుడై అందులోనే తాను నమ్మిన బీసి వాదాన్ని వెతుక్కుంటూ ప్రయాణం సాగిస్తున్నారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బీసి ని ముఖ్యమంత్రిని చేస్తామన్న బిజేపి పెద్దల ప్రకటనలతో ఖమ్మం నియోజకవర్గం టిక్కెట్ విషయంలో డాక్టర్ శీలం పాపారావు పేరు వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, మరో రెండు రోజుల్లో పాపారావు పేరు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ పాపారావు గురించి కొన్ని విషయాలు దక్ష రీడర్స్ కోసం..

Hospital

ఖమ్మం నగరంలోని శాంతి నగర్ కు చెందిన శీలం పాపారావు, శీలం రాంచందర్ లక్ష్మి దంపతుల తొలి సంతానం. తల్లి గృహిణి. తండ్రి స్వీట్ మాస్టర్. పాపారావు చిన్నతనంలో ఖమ్మం గాంధీచౌక్ లోని మోహన్ స్వీట్స్ లో రాంచందర్ రావు పనిచేసేవారు. తన పెద్ద కొడుకు డాక్టరైనా, చిన్నకొడుకు నాగరాజు తెలంగాణ విద్యారణ్య స్కూల్ కి కరస్పాండెంట్ అయినా ఆయన ఎప్పుడూ తను నమ్ముకున్న, తనకు అన్నం పెట్టిన వృత్తిని వదులుకోలేదు. పిల్లలు వద్దని వారించినా ప్రస్తుత పాత మున్సిపాలిటీ వద్ద గల మోహన్ స్వీట్స్ లో విధులు నిర్వర్తించేవారు. అది ఆయన నిబద్దత. మనం ఏ స్థాయికి ఎదిగినా మూలాల్ని మర్చిపోరాదనే తండ్రి చెప్పిన మాటలే పాపారావుకి స్ఫూర్తి.

read also : ఖమ్మం బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థిగా డా. శీలం పాపారావు..?

చిన్నతనం నుండి తన విద్యాబ్యాసం అంతా ఖమ్మంలోనే జరిగింది అని చెప్పే పాపారావు ఒకటి నుండి
పదో తరగతి వరకు సెయింట్ మేరీస్ స్కూల్ లోనే చదివారు. ఇంటర్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ఎంబీబీఎస్ విజయవాడ సిద్దార్ధా మెడికల్ కళాశాలలో, ఎమ్మెస్ వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పూర్తి చేశారు. 1997 నుండి 2002 వరకు ఖమ్మం మమతా మెడికల్ కళాశాలలో వైద్యుడిగా పనిచేశారు. అనంతరం మణుగూరు సింగరేణి హాస్పిటల్ లో, తర్వాత ప్రభుత్వ మెడికల్ అఫీసర్ గా పేరూరు, రోంపేడు, కామేపల్లి, జూలూరు పాడు వంటి ప్రాంతాల్లో పనిచేశారు. సర్జన్ గా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లోను సేవలందించారు. ప్రస్తుతం ఖమ్మం నెహ్రూనగర్ లో శీలం పాపారావు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పి సేవలందింస్తున్నారు.

రాజకీయారంగేట్రం..
2014 వరకు తన పనేంటో తాను చేసుచేసుకుంటూ నిబద్దత గల వైద్యాధికారిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన డాక్టర్ పాపారావు, తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఖమ్మం మెడికల్ జేఏసి కో కన్వీనర్ గా బాద్యతలు నిర్వర్తించారు. ప్రొపెసర్ డాక్టర్ కోదండరామ్ మార్గదర్శకత్వంలో పొలిటికల్ జేఏసి చైర్మన్ గా, కొనసాగారు. తెలంగాణ జనసమితి ఆవిర్భావం అనంతరం అనివార్యంగా జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగాల్సి వచ్చింది. అలా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే .. ప్రజ పోరాటంలో అలవోకగా అడుగులు వేసిన ఆయన, తన ఆత్మీయుడైన ఈటెల రాజేందర్ ప్రోద్భలంతో, ఆయన బిజేపిలో అడుగుపెట్టాక ఆయన తోనే బిజేపి కండువా కప్పుకున్నారు.

read also : బీజేపీకి రాజీనామా చేస్తా : బాబు మోహన్

బిజేపి కంఫర్టేనా..?

బీసీ నేతగా వివిధ బీసీ సంఘాల మద్దతుదారుగా పనిచేసిన శీలం పాపారావు ఇప్పుడు బిజేపి లో స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా కొనసాగడం .. బిజేపి పెద్దల ఆశీస్సులతో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీలో నిలవబోవడం తనకు సౌకర్యంగా ఉందా అంటే డాక్టర్ పాపారావు అవుననే చెపుతున్నారు. ఏపార్టీ ధైర్యం చేయని విధంగా బిజేపి బీసిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించడం, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. భారతీయ సంస్కృతి మూలాలతో సంప్రదాయ ఆచారవ్యవహారాలను జాతికి సజీవంగా అందించేందుకు ప్రయత్నించే బిజేపి, బలహీనులు ఏవర్గానికి చెందిన వారైనప్పటికీ.. అందరికీ సమాన హక్కులు, అవకాశాలు అందేలా కృషి చేయడంలో ఎప్పుడూ ముందుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 

Leave A Reply

Your email address will not be published.