Read News in Telugu Language
adsdaksha

ఖమ్మం బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థిగా డా. శీలం పాపారావు..?

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 29

బిజేపి ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖమ్మం ( khammam ) నగరానికి చెందిన డాక్టర్ శీలం పాపారావు ( dr. seelam paparao ) పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. బిజేపి ( bjp ) ని గెలిపిస్తే బిసి అభ్యర్థిని సిఎం చేస్తామని బిజేపి అధిష్టానం ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఖమ్మం సీటు కు పాపారావు పేరును బిజేపి అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. గతంలో పలు బీసి సంఘాల్లో క్రియాశీలకంగా పనిచేసిన డాక్టర్ పాపారావు ప్రస్తుతం బిజేపి స్టేట్ కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నారు.
పాపారావుకి అందరిలో కలిసిపోయే మనస్తత్వం, కలుపుగోలు తనం ఉండడంతోపాటూ, వివాదరహితుడిగా పేరుంది. కులమతాల కతీతంగా అందరినీ కలుపుకుపోయే పాపారావు గతంలో అనేక బీసీ సంఘాల్లోను పనిచేశారు.

read also : బీజేపీకి రాజీనామా చేస్తా : బాబు మోహన్

Hospital

సంఘ సేవకుడు, విద్యావంతుడైన డాక్టర్ పాపారావు పేరును అధిష్టానం ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పరిశీలించడం పట్ల ఖమ్మం బిజీపి శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన కు సీటు కేటాయిస్తే పార్టీల కతీతంగా ఇతర బీసీ సంఘాల మద్దతు లభిస్తుందని తద్వారా బీసీ ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది. ఇప్పటి వరకు ఖమ్మం నియోజకవర్గానికి బిజేపి నుండి సరైన అభ్యర్థి లేరని భావించిన వారికి బిజేపి అధిష్టానం శీలం పాపారావు పేరును పరిగణలోకి తీసుకోవడం చర్చానీయాంశం అయింది.

పాపారావు పోటీతో గెలుపు ఓటముల మాట పక్కనపెట్టినా, కనీసం మిగతా అభ్యర్థులకు బీసీ సామాజిక వర్గం నుండి కొంత పోటీ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.