Read News in Telugu Language
adsdaksha

13 రోజుల్లో పూరిస్థాయిలో మిల్లర్ల నుంచి బియ్యాన్ని తీసుకోవాల్సిందే ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : జనవరి 18

31వ తేదీ తర్వాత డిఫాల్ట్ మిల్లర్లపై కఠిన చర్యలు..

ఏది ఏమైనా సరే… ఈ నెల 31వ తేదీలోగా గత ఏడాది వానాకాలం సీజన్ కి సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను మిల్లర్ల నుంచి పూర్తిస్థాయిలో సేకరించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ కమీషనర్ డి.ఎస్.చౌహాన్ ( ds chauhan ) అధికారులను ఆదేశించారు. ప్రతి గింజ ఎఫ్ సిఐ ( fci ) కి ఇవ్వాల్సిందే అని, డిఫాల్ట్ చేసుకుని కార్పొరేషన్ కు ఇస్తామంటే కుదరదని అన్నారు. కస్టమ్ మిల్లింగ్ రైస్, డిఫాల్ట్ మిల్లర్ల నుంచి ఫెనాల్టీ వసూలు, పిడిఎస్ ( pds ) బియ్యం నాణ్యత, పాత గన్నీ సంచుల సేకరణ, వినియోగం తదితర అంశాలపై ఎంసిఆర్ హెచ్ ఆర్డీలో గురువారం అడిషినల్ కలెక్టర్లు, డిసిఎస్ వోలు, డిఎంలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమీషనర్ డి.ఎస్. చౌహాన్ మాట్లాడుతూ ఉద్దేశ పూర్వకంగా ఎఫ్ఎస్ఐకి బియ్యం ఇవ్వకుండా డిఫాల్ట్ చేసుకుని 31వ తేదీ తర్వాత గతంలో మాదిరిగా పాతపద్ధతిలో పౌరసరఫరాల సంస్థకు బియ్యం ఇస్తామంటే కుదరదని, ఎట్టిపరిస్థితులోనూ అంగీకరించబోమని స్పష్టం చేశారు.

read also : అయోధ్య భోజనం ఖర్చు అంతా ప్రభాస్ దే..!

ప్రజాపంపిణీకి కార్పొరేషన్ దగ్గర అవసరమైన బియ్యం నిల్వలు ఉన్నాయని, ఆ పరిస్థితిలో ప్రతి బియ్యం గింజను కూడా ఎఫ్ సిఐకి అప్పగించాల్సిందేనని డి.ఎస్. చౌహాన్ అన్నారు. ప్రతిసారి డిఫాల్ట్ కావడం, తర్వాత కార్పొరేషన్కు బియ్యం ఇవ్వడం ఒక అలవాటుగా మారిందని అసంతృప్తి వ్యక్తం చేస్తూ పాత పద్ధతులను పక్కన పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ కాదనే విషయాన్ని ప్రతిఒక్కరు గుర్తుంచుకోవాలన్నారు. డిఫాల్ట్ అయిన మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Hospital

గతంలో డిఫాల్ట్ అయిన మిలర్ల నుంచి 25శాతం ఫెనాల్టీని వసూలు చేశామని ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టబోమని చౌహాన్ అన్నారు. బియ్యం సేకరణ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారని తెలిపారు. సీఎంఆర్ డెలవరీలపై ఇప్పటికే మంత్రిగారు కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత డెలవరీలలో కాస్తా వేగం పెరిగిందని ఇందుకు కృషిచేసిన జిల్లా కలెక్టర్లకు అభినందనలు తెలియజేశారు.
రాష్ట్రంలో మిల్లింగ్ సామర్థ్యం ప్రకారం మిల్లింగ్ జరగడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రోజుకు ఒక షిఫ్ట్ ప్రకారం 71వేలు, రెండు షిఫ్ట్ల ప్రకారం 1.40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లింగ్ చేసే సామర్థ్యం ఉన్నా ఏ ఒక్కరోజు కూడా సామర్థ్యం ప్రకారం మిల్లింగ్ జరగడంలేదన్నారు.

read also : తమ్మినేని కి మంత్రి పొంగులేటి పరామర్శ .. మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా డాక్టర్ లకు సూచన..

పిడిఎస్ బియ్యం నాణ్యత మెరుగుపడాలి :

ప్రజాపంపిణీ ద్వారా పేదలకు అందిస్తున్న రేషన్ బియ్యం నాణ్యత చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉందని, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడకూడదని చౌహాన్ అధికారులను ఆదేశించారు.
సేకరిస్తున్నారని కొంత మంది అధికారులు ఉద్దేశపూర్వకంగా అవసరానికి మించి అధిక మొత్తంలో గన్నీ సంచులను సేకరిస్తున్నారని
ఇందులో 20 శాతం, 30 శాతం కూడా వినియోగించని జిల్లాలు ఉన్నట్లు తన దృష్టికి రాగానే విచారణకు అదేశించడం జరిగిందన్నారు. వచ్చే సీజన్ నుంచి ఇటువంటి విధానాలకు స్వస్తి పలకాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.