Read News in Telugu Language
adsdaksha

95మంది డీఎస్పీలు బదిలీ.. పోలీస్ డిపార్ట్ మెంట్ లో వరుస ట్రాన్స్ ఫర్స్..

దక్ష న్యూస్, హైదరాబాద్: ఫిబ్రవరి 15

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మొన్నటికి మొన్న ఐపీఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం.. తాజాగా డీఎస్పీలను ట్రాన్స్‌ఫర్ చేసింది. ఏకంగా 95 మంది డీఎస్పీలను, ఏసీబీలను సర్కార్ బదిలీ చేసింది.

Read also: తొలిసారి రాజ్యసభకు సోనియా నామినేషన్.. రాజస్థాన్‌ నుంచి పోటీ..

Hospital

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బదిలీల పర్వం కొనసాగుతోంది. ఇటీవల 12 మంది ఐపీఎస్, దాదాపు 150 మంది వరకు డీఎస్పీ, అడిషనల్ ఎస్పీలను రాష్ట్ర ప్రభుత్వం కొత్త స్థానాల్లోకి బదిలీ చేసింది. ఐదుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, 39 మంది అదనపు ఎస్పీలను సైతం వేరే స్థానానికి ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు 250 మందికి పైగా పోలీస్ ఉన్నతాధికారుల స్థానాల్లో మార్పులు చేర్పులు జరిగాయి.

Read also: గులాబీ ఎమ్మెల్యేల హై డ్రామా .. అసెంబ్లీ నుంచి వాకౌట్..

గత మూడేళ్లుగా ఒకేచోట పని చేస్తోన్న, సొంత జిల్లాల్లో పని చేస్తోన్న అధికారులను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ గత డిసెంబర్‌లో ఆదేశించింది. ఈసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం బదిలీలు చేస్తోంది.

Leave A Reply

Your email address will not be published.