Read News in Telugu Language
adsdaksha

Uae : యూఏఈలో తొలి హిందూ దేవాలయం .. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ..

దక్ష న్యూస్, న్యూ ఢిల్లీ : ఫిబ్రవరి 15

యూఏఈలోని తొలి హిందూ దేవాలయాన్ని ప్రధాని మోదీ బుధవారం ప్రారంభించారు. దుబాయ్ ( dubai ) వేదికగా నిర్వహిస్తున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్-2024 ( dubai world government summit – 2024 ) లో మోదీ ( modi ) పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత అత్యాధునిక ప్రపంచానికి స్వచ్ఛమైన సాంకేతిక పరిజ్ఞానం ఉన్న స్మార్ట్ ప్రభుత్వాలు అవసరమని ప్రధాని నరేంద్రమోదీ ( narendra modi ) అన్నారు. పదేండ్ల నుంచి భారత ప్రభుత్వం మినిమమ్ గవర్నమెంట్.. మాగ్గిమమ్ గవర్నెన్స్ నినాదంతో పనిచేస్తోందని, ప్రజలకు తమపై నమ్మకం ఏర్పడేందుకు ఇదే ప్రధాన కారణమని మోదీ చెప్పుకొచ్చారు.

read aalso : కేజ్రీవాల్ కు ఆరోసారి సమన్లు.. 19న విచారణకు ఈడీ ఆదేశం..

Hospital

గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా 23 ఏండ్ల నుంచి తాను ప్రభుత్వంలో ఉన్నానని, మహిళాభివృద్దికి తమ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని మోదీ తెలిపారు. సామాజికంగా ఆర్థికంగా ప్రజలను బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకున్నామని, 50 కోట్ల మంది ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించామని తెలిపారు. అయితే ఓవైపు యావత్ ప్రపంచం సాంకేతికత రంగంలో దూసుకెళ్తున్నా.. మరోవైపు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని మోదీ చెప్పారు.

read aalso : 95మంది డీఎస్పీలు బదిలీ.. పోలీస్ డిపార్ట్ మెంట్ లో వరుస ట్రాన్స్ ఫర్స్..

మరోవైపు యూఏఈ దేశాధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌‌పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. షేక్ మహమ్మద్ ఒక విజన్ ఉన్న నాయకుడని.. ఆయన నాయకత్వంలో దుబాయ్‌ ప్రపంచ ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా మారుతోందని పొగడ్తలు కురిపించారు. ఈ క్రమంలోనే వాణిజ్యం, పెట్టుబడులు, డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫిన్‌టెక్‌ తదితర రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య 8 ఒప్పందాల పరస్పర మార్పిడి జరిగిందని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.