Read News in Telugu Language
adsdaksha

ఈసీ కొత్త మొబైల్ యాప్ ..అరచేతిలో అభ్యర్థుల సమాచారం..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 18

– లాంచ్ చేసిన ఈసీ చీఫ్..

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను ప్రజలు తెలుసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త చర్యలు చేపట్టింది. ఏ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు..? ఏ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు..? వారి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? ఎవరికి ఓటేస్తే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి..? తదితర అంశాలను ఓటరు తెలుసుకునేందుకు విధంగా ఎన్నికల కమిషన్ పకడ్బంధీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ కొత్త మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. అభ్యర్థుల ప్రొఫైల్ దగ్గరి నుంచి మొదలు పెడితే.. అభ్యర్థిపై ఉన్న పలు కేసులు, నేరచరిత్ర వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ తెలిపారు.

Hospital

read also : ఎలక్టోరల్ బాండ్ల లెక్క బయట పెట్టిన ఈసీ.. అత్యధిక బాండ్లు బీజేపీ పార్టీకే ..

నిజానికి ఈ యాప్‌ను లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు ముందే విడుదల చేశారు. ‘నో యువర్ క్యాండిడేట్ కేవైసీ’ పేరుతో ఈ యాప్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ వినియోగదారులతో పాటు ఐఓఎస్ వినియోగదారులకూ ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రతీ ఓటరుకు తన నియోజకవర్గంలో పోటీపడుతున్న అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఉందని చెప్పారు. అభ్యర్థుల నేర చరిత్ర వివరాలు తెలుసుకుంటే ఎవరికీ ఓటేయాలనే దానిపై ఓటరుకు స్పష్టత వస్తుందని, సరైన అభ్యర్థిని ఎన్నుకునే వెసులుబాటు ఓటర్లకు కలుగుతుందని స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.