Read News in Telugu Language
adsdaksha

తనిఖీల్లో పట్టుబడే నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు మార్గదర్శకాలను పాటించాలి..

దక్ష న్యూస్, ఖమ్మం: అక్టోబర్ 21

సీజ్, విడుదల సమయంలో మీడియాకు సమాచారం అందించాలి..

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహించే తనిఖీల్లో పట్టుబడే నగదు, బంగారం సీజ్ చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ (election commission ) నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ( vikasraj ) అన్నారు. శనివారం హైదరాబాద్ ( hyderabad ) నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, రాష్ట్ర డీజీపీ ( dgp )  అంజనీ కుమార్ ( anjanikumar ), ఇతర రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఎం.సి.ఎం.సి. ( mcmc ), నగదు, బంగారం పట్టివేత, సి విజిల్ యాప్, తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ( khammam collector ) వి.పి. గౌతమ్ ( v.p. gautham ), పోలీస్ కమిషనర్ .. అదనపు కలెక్టర్ లతో కలిసి నూతన కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి పాల్గొన్నారు.

read also : మహబూబ్ నగర్ దసరా ఉత్సవాలకు రాష్ట్రంలోనే గొప్ప పేరు..

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, రాజకీయ పార్టీల, అభ్యర్థుల నుంచి వచ్చే ఫిర్యాదులకు తీసుకున్న చర్యలపై లిఖిత పూర్వక సమాధానం తప్పనిసరిగా అందించాలని అన్నారు. ఎన్నికల ప్రచారం సంబంధించి సమావేశాలు, సభలు నిర్వహించుకునేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధుల, అభ్యర్థుల నుంచి సువిధ యాప్ ద్వారా, ఆఫ్ లైన్ లో వచ్చే దరఖాస్తులకు ఎప్పటికప్పుడు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని, క్షేత్రస్థాయిలో జరిగే ఎన్నికల ప్రచారంలో వినియోగించే ఆడియో, వీడియోలను పరిశీలించి ఎం.సి.ఎం.సి. ధృవీకరించాలని, ప్రతి రోజూ ఎం.సి.ఎం.సి., సువిధ యాప్, అఫ్ లైన్ దరఖాస్తులపై ఎన్నికల అధికారి దృష్టి సారించాలని అన్నారు.

Hospital

ఎన్నికల సమయంలో నిర్వహించే తనిఖీల్లో నగదు, బంగారం సీజ్ చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనలపై క్షేత్రస్థాయి అధికారులకు సంపూర్ణ అవగాహన కల్పించాలని వికాస్ రాజ్ అన్నారు. నగదు సీజ్ చేసే సమయంలో సంబంధిత వ్యక్తులకు సీజ్ చేస్తున్న నగదు, బంగారం వివరాలు, ఎక్కడ అప్పీల్ చేయాల్సి ఉంటుంది అనే అంశాలను తెలియజేస్తూ రశీదు తప్పనిసరిగా అందించాలని అన్నారు. సీజ్ చేసిన బంగారం, నగదు 10 లక్షల కంటే తక్కువైతే వెంటనే జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెల్ కు అప్పగించాలని, 10 లక్షల కంటే ఎక్కువ నగదు సీజ్ చేస్తే ఐటీ అధికారులకు అప్పగించాలని అన్నారు. సదరు నగదుపై వచ్చే అపీల్ లను సంబంధిత గ్రీవెన్స్ సెల్, ఐటీ అధికారులు పరిశీలించి నిబంధనలు, ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారని అన్నారు.
ఎన్నికల సమయంలో మనం సీజ్ చేసే నగదు, బంగారం, మద్యం, ఇతర విలువైన అభరణాల గురించి మీడియాకు సమాచారం అందించాలని, అదే విధంగా సంబంధిత వ్యక్తులు చేసిన అప్పీల్ అనంతరం విడుదల చేసే నగదు వివరాలు సైతం ప్రెస్ కు అందించాలని, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదిక నిర్ణిత నమూనాలో సమర్పించాలని అన్నారు.

read also : title suit : ప్రాపర్టీలకు సిబిల్ లాంటి యాప్.. టైటిల్ సూట్ గురించి మీకు తెలుసా..?

ఎన్నికల విధులు నిర్వహించే ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, స్టాటిక్ సర్వేలెన్సు బృందాలు, వీడియో సర్వేలెన్సు బృందాలతో పాటు తప్పనిసరిగా వీడియో కెమెరా సౌకర్యం ఉండాలని, ప్రతి తనీఖీ వీడియో కెమెరాలో రికార్డు చేయాలని అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వల్నరబుల్ పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. వల్నరబుల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించే సమయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు అందించే ఫిర్యాదులను సైతం దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొన్నారు. జిల్లాలో ఓటర్ స్లిప్పులు త్వరగా ముద్రించి పంపిణీ చేసే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని, సామాజిక మాధ్యమాలలో ఎన్నికల నిర్వహణపై వస్తున్న వదంతులు, అపోహలను నివృత్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని, తక్కువ పోలింగ్ నమోదైన పోలింగ్ కేంద్రాలపై అధిక దృష్టి సారించి పోలింగ్ శాతం పెరిగే విధంగా విస్తృతంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

సమావేశంలో డిసిఓ విజయకుమారి, సిపిఓ ఏ. శ్రీనివాస్, డిపిఆర్వో ఎం.ఏ. గౌస్, ఏసీపీ గణేష్, ఎన్నికల విభాగ తహసిల్దార్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.