Read News in Telugu Language
adsdaksha

రాష్ట్రంలో భారీగా ట్రాన్స్ ఫర్స్ ..32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132 మంది ఎమ్మార్వోల బదిలీలు ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 10

రాష్ట్రంలో భారీగా అధికారుల ట్రాన్స్ ఫర్స్ అయ్యాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ( election commission ) మార్గదర్శకాల మేరకు బదిలీలు జరిగాయి. 32 మంది డిప్యూటీ కలెక్టర్ల ( deputy collector ) ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. మరికొందరు డిప్యూటీ కలెక్టర్లు వెయిటింగ్ లో ఉండగా పోస్టింగ్ ఇచ్చారు.

Hospital

read also : భారత్ రికార్డు… 97 కోట్లకు చేరిన ఓటర్లు.. 2 కోట్ల మంది యూత్ కొత్తగా నమోదు ..

132 మంది ఎమ్మార్వోలు బదిలీ అయ్యారు. మల్టీజోన్-1, మల్టీజోన్-2లో ఎమ్మార్వోలకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మల్టీజోన్-1లో 84 మంది, మల్టీజోన్-2లో 48 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఒకే చోట మూడేళ్లుగా పనిచేసేవారు, సొంత జిల్లాలో విధులు నిర్వహిస్తోన్న వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అధికారుల ట్రాన్స్ ఫర్స్ జరిగినట్లు తెలుస్తోంది.

 

 

Leave A Reply

Your email address will not be published.