Read News in Telugu Language
adsdaksha

ఏప్రిల్ 22లోపు అప్లై చేసుకోవచ్చు .. హోమ్ ఓటింగ్‌పై సీఈఓ వికాస్ రాజ్ ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 18

లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ప‌క‌డ్బందీగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి(సీఈవో) వికాస్ రాజ్ స్ప‌ష్టం చేశారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల షెడ్యూల్ నేప‌థ్యంలో సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఓటు ఫ్రం హోం కోసం ఏప్రిల్ 22 లోపు అర్హులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని సూచించారు. ఇందుకు ఫారం -డీ పంపిణీ చేయాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశాలు జారీ చేశామ‌ని తెలిపారు.

read also : తెలంగాణ సొమ్ము ఢిల్లీ కి చేరుతోంది.. ఒక దోపిడీదారుడు మరొక దోపిడీదారుడితో పోరాడలేడు : మోదీ

ఆర్‌వో వ‌ద్ద పోస్ట‌ల్ బ్యాలెట్ ప్రింటింగ్ ఉంటుంద‌ని వికాస్ రాజ్ తెలిపారు. 85 ఏళ్లు పైబడిన వారికి, 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్న వారు ఇంటి వద్ద నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించడం తెలిసిందే. ఇంటి వద్ద ఓటింగ్ ప్రక్రియ అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ తరువాత మూడు, నాలుగు రోజులకు హోం ఓటింగ్ మొదలుపెడతామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు.

Hospital

read also : నా విరాళాలు ఇచ్చాను.. ఎలక్టోరల్ బాండ్లపై కిరణ్ మజుందార్ షా ..

అత్యవసర సర్వీసులు అనే విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఈసీ నిర్ణయించినట్లుగా పోస్టల్ ఓటింగ్ అవకాశం కల్పించారు. గ‌తేడాది అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ 2.09 లక్ష‌ల మంది పోస్ట‌ల్, హోం ఓటింగ్‌ను వినియోగించుకున్నార‌ని గుర్తు చేశారు. చంచ‌ల్‌గూడ‌లో ఈవీఎం బ్యాలెట్ పేప‌ర్ల ప్రింటింగ్ జ‌రుగుతుంద‌ని తెలిపారు.

read also :

రాష్ట్రంలో 85 ఏండ్లు దాటిన వృద్ధులు 1.85 ల‌క్ష‌ల మంది, దివ్యాంగ ఓట‌ర్లు 5.26 ల‌క్ష‌ల మంది ఉన్నార‌ని సీఈఓ పేర్కొన్నారు. మొత్తం 90,365 పోలింగ్ కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అభ్య‌ర్థుల నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ త‌ర్వాత మూడు, నాలుగు రోజుల్లో హోమ్ ఓటింగ్‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని సీఈవో వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.