Read News in Telugu Language
adsdaksha

ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది.. 7 విడతల్లో లోక్ సభ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు..

దక్ష న్యూస్, హైదరాబాద్: మార్చి 16

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. 543 లోక్‌సభ స్థానాలతో పాటు 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు.

Read also: ప్రతీ గడపకు లబ్ది గ్యారెంటీ.. ఇందిరమ్మ రాజ్యంతోనే అభివృద్ధి సాధ్యం..

Hospital

ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. మరోవైపు ఏపీ, తెలంగాణలో నాలుగో దశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మే 13న జరుగుతుందని ఈసీ ప్రకటించింది. ఏపీలో అసెంబ్లీ సహా అదే రోజు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. నాలుగో విడతలో భాగంగా ఏపీలోని 25 ఎంపీ స్థానాలకు, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించి అన్ని ఫలితాలు ప్రకటించనున్నారు.

Read also: కాంగ్రెస్ లో చేరిన జితేందర్ రెడ్డి .. దీపా దాస్ మున్షీ సమక్షంలో కొడుకుతో కలిసి చేరిక..

మే 13న సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై పోల్ :

తెలంగాణలో నాలుగో దశ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ మే 13న జరుగుతుందని ఈసీ ప్రకటించింది.లోక్ సభ ఎన్నికలతో పాటు అదే రోజున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యానందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది.

Leave A Reply

Your email address will not be published.