Read News in Telugu Language
adsdaksha

ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం .. వెంటనే ఆపేయాలని బ్యాంకులకు సుప్రీం కోర్టు ఆదేశం ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : ఫిబ్రవరి 15

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచ్చిన ఎన్నికల బాండ్ల (electoral bonds scheme) చెల్లుబాటుపై సుప్రీం కోర్టు (Supreme court) సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఈ ఎన్నికల బాండ్ల జారీని బ్యాంకులు వెంటనే ఆపేయాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. గురువారం ఈ మేరకు సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగీవ్ర తీర్పునిచ్చింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం వెల్లడించింది.

read also : అవయవ దాతలకు గౌరవంగా అంత్య క్రియలు .. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన నిర్ణయం ..

Hospital

నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఆ కారణంతో సహ చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని సుప్రీం తెలిపింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని, ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని కూడా ఉల్లంఘించినట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. మరోవైపు సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే కంపెనీల చట్టంలో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

read also : ఉద్యోగాలు ఇచ్చే చాతకాలే.. మేం 25 వేల నౌకర్లు ఇచ్చాం: సీఎం రేవంత్ ..

2019 ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చి 13వ తేదీలోగా ఆ వివరాలను వెబ్ సైట్లో ప్రచురించాలని ఈసీని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.