Read News in Telugu Language
adsdaksha

ఎలక్టోరల్ బాండ్ల లెక్క బయట పెట్టిన ఈసీ.. అత్యధిక బాండ్లు బీజేపీ పార్టీకే ..

దక్ష న్యూస్, హైదరాబాద్ : మార్చి 18

పొలిటికల్ పార్టీల ఎన్నికల బాండ్ల ( electoral bonds ) విరాళాలకు సంబంధించిన స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ( sbi ) ఇచ్చిన కొత్త సమాచారాన్ని ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. సీల్డ్ కవరులో కోర్టుకు ఇచ్చిన వివరాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇటీవల బాండ్ల పూర్తి వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్‌బీఐపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కొత్త సమాచారాన్ని ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచింది. బీజేపీ రూ.8వేల కోట్లకు పైగా ఎన్నికల బాండ్ల రూపంలో అందుకోగా, బీఆర్ఎస్ రూ.1322 కోట్లు వచ్చాయి.

read also : నామినేటెడ్ జాతర షురూ .. 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం ..

Hospital

ఈసీ వెల్లడించిన డేటా ప్రకారం ఆయా పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలపై క్లారిటీ వచ్చింది. ఇందులో అత్యధికంగా బీజేపీ రూ.8,718.5 కోట్ల విరాళాలను ఎన్నికల బాండ్ల రూపంలో అందుకోగా, వీటిలో రూ.2555 కోట్లు కేవలం 2019-20లోనే రావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో తృణమూల్ కాంగ్రెస్ రూ.1397 కోట్లు, కాంగ్రెస్ పార్టీ రూ.1334 కోట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోని బీఆర్ఎస్‌కు రూ.1322 కోట్లు, టీడీపీకి రూ.181.35 కోట్లు, వైసీపీకి రూ.442.8 కోట్లు అందుకోవడం గమనార్హం.

read also : నేటి నుండి విదేశీ మీడియా ప్రతినిధుల బృందం పర్యటన.. హైదరాబాద్ చేరుకున్న 22 మంది పాత్రికేయులు..

బిజు జనతాదళ్‌‌ రూ.944 కోట్లు, డీఎంకే రూ.656.5కోట్లు అందుకోగా, ఇందులో రూ.509 కోట్లు లాటరీ కింగ్‌ శాంటియాగో మార్టిన్‌ నుంచే వచ్చాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రూ.442.8 కోట్లు, టీడీపీకి రూ.181.35 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీకి రూ.14.5 కోట్లు, అకాలీదళ్‌‌కు రూ.7.26కోట్లు, ఏఐఏడీఎంకే పార్టీకి రూ.6.05కోట్లు, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీకి రూ.50లక్షలు ఎన్నికల బాండ్ల రూపంలో వచ్చాయి.

Leave A Reply

Your email address will not be published.