Read News in Telugu Language
adsdaksha

అమ్మాయిల కోసం తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పథకం ..

దక్ష న్యూస్, హైదరాబాద్: డిసెంబర్ 19

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక పథకం అమలుకు అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీలో పేర్కొన్నట్లుగా అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ( electric scooter ) పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. 18 ఏళ్లు నిండి. చదువుకునే అమ్మాయిలకు ఈ పథకం వర్తించనుంది. అయితే, ఈ పథకం అమలు కోసం మార్గదర్శకాలు రూపొందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన అమ్మాయిలు ఎంతమంది ఉంటారనే దానిపై అధికారులు గణాంకాలు సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ పథకం డిస్టెన్స్‌లో చదువుకునే అమ్మాయిల కువర్తించదనే ప్రచారం జరుగుతోంది. రెగ్యులర్‌గా కాలేజీలకు వెళ్లే వారికి మాత్రమే ఈ పథకం వర్తింపజేసేలా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

read also : usv : కొత్త సంవత్సరంలో సందడి చేయనున్న టాప్ ఎస్.యు.వి ఎలక్టిక్ వాహనాలు.. ఫీచర్స్ చూస్తే ఆశ్చర్యపోవలసిందే..

Hospital

అలాగే, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారే ఈ పథకానికి అర్హులుగా చెబుతున్నారు. పూర్తిగా డ్రైవింగ్ వచ్చిన వారికే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ఎలక్ట్రిక్ వాహనాలపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. ఈ పథకం అమలు కోసం అధికారులు విధివిధానాలు రూపొందిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ పథకంపై గైడ్‌లైన్స్ రూపొందించే అవకాశం కనిపిస్తోంది. కాగా, తెలంగాణ ( telangana ) అసెంబ్లీ ఎన్నికల వేళ.. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన చదువుకునే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్స్ పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ మేరకు మేనిఫెస్టోలో కూడా పెట్టింది కాంగ్రెస్. 6 నెలల్లోగా ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.

read also : నేడే దుబాయిలో ఐపీఎల్ వేలం పాట..

యువ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అనేక పథకాలను మేనిఫెస్టోలో ప్రకటించింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే స్కూటీ పథకం కూడా పేర్కొంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవడంతో.. అమ్మాయిలంతా ఈ పథకం అమలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.